Home Filmy Adda ప్రభాస్ “ఆదిపురుష్” సినిమా వాయిదా వేయడం వెనుక… ఇంత పెద్ద కారణం ఉందా..?

ప్రభాస్ “ఆదిపురుష్” సినిమా వాయిదా వేయడం వెనుక… ఇంత పెద్ద కారణం ఉందా..?

by Mohana Priya

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. అయోధ్యలో ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ టీజర్ విడుదల అయ్యింది. బాహుబలి తర్వాత నుండి ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు కూడా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో విడుదల అవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే విడుదల అవుతోంది.

ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఓం రౌత్ అంతకుముందు తానాజీ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా హిందీలో చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. టీజర్ లో ప్రభాస్ తో పాటు వీరు కూడా కనిపిస్తున్నారు. రాముడిగా ప్రభాస్ లుక్ చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు అభినందిస్తున్నారు.

minus points in prabhas adipurush teaser

అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడింది అంటూ సినిమా బృందం ఇటీవల ప్రకటించింది. దీని వెనుక కారణం ఏంటి అనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ దీని వెనుక కారణం ఇదే అంటూ ఒక వార్త మాత్రం వైరల్ అవుతోంది. అదేంటంటే సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అనే సినిమా బృందం అనుకుంటున్నారు అని, అందుకే మళ్లీ గ్రాఫిక్స్ పని చేయాలి అని సినిమా వాయిదా వేశారు అని అంటున్నారు.

minus points in prabhas adipurush teaser

అంతే కాకుండా ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ మళ్లీ చేయడానికి దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. కొంత మంది, “సినిమా విడుదల ఆలస్యం అయ్యింది” అని అనుకుంటూ ఉంటే, కొంత మంది మాత్రం, “సినిమా వాయిదా వేయడమే మంచిది అయ్యింది. ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకుని విడుదల చేయడమే నయం. అప్పుడే హిట్ అవుతుంది” అని అంటున్నారు.

You may also like