Ads
రెండు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న కేజిఎఫ్ 2 టీజర్ విడుదలయ్యింది. జనవరి 8వ తేదీన రాకింగ్ స్టార్ యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ విడుదల చేశారు. టీజర్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటివరకు ఉన్న సస్పెన్స్ ఒక ఎత్తయితే, టీజర్ చూసిన తర్వాత పెరిగిన ఆసక్తి ఇంకొక ఎత్తు అనేలా ఉంది. మొదటి పార్ట్ కి ఇది కొనసాగింపే కాబట్టి కేజిఎఫ్ 1 లో చూసిన పాత్రలు ఈ సినిమాలో కూడా ఉంటారు.
Video Advertisement
కానీ సెకండ్ పార్ట్ లో రావు రమేష్, బాలీవుడ్ స్టార్లు రవీనా టాండన్, సంజయ్ దత్, అలాగే ఈశ్వరీ రావు కూడా కనిపిస్తున్నారు. వీరిలో రవీనా టాండన్ రమికా సేన్ గా నటిస్తుండగా, నెగిటివ్ పాత్ర అయిన అధీరా గా సంజయ్ దత్ నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.
మొదటి పార్ట్ లో ఉన్న ఫేమస్ డైలాగ్ “పవర్ ఫుల్ పీపుల్ కం ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్” అనే డైలాగ్ టీజర్ లో కూడా వినిపిస్తుంది. కానీ దీనికి ఎడిషన్ గా “అది తప్పు అని, పవర్ ఫుల్ ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్” అనే డైలాగ్ కూడా ఉంది. వాయిస్ ఓవర్ లో ఉన్న గొంతు ప్రకాష్ రాజ్ గొంతు లాగా అనిపిస్తుంది. అయితే, ప్రతి భాషకు సపరేట్ గా కాకుండా అన్ని భాషలకు కలిపి ఇంగ్లీష్ లో టీజర్ విడుదల చేశారు.
కానీ చాలామంది మాత్రం “ఇలా అన్ని భాషలకి కలిపి ఒకటే భాషలో విడుదల చేయడం ఏంటి?” అని అనుకుంటున్నారు. అంతకుముందు పాన్ ఇండియన్ సినిమాలు అయిన బాహుబలి, సైరా నరసింహారెడ్డి, ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన టీజర్లు కూడా అన్ని భాషల్లోనూ విడుదల అయ్యాయి. కానీ కేజిఎఫ్ 2 టీజర్ మాత్రం కేవలం ఇంగ్లీష్ లో విడుదల చేశారు. ఇందుకు ఒక కారణం ఉంది. అదేంటంటే.
సాధారణంగా ప్రతి భాషలో టీజర్ విడుదల చేస్తే ఏ భాషకు సంబంధించిన వాళ్ళు ఆ భాష టీజర్ మాత్రమే చూస్తారు. కొంత మంది మాత్రం అన్ని భాషల టీజర్లు చూస్తారు. కానీ ఎక్కువమంది మాత్రం వాళ్ల ప్రాంతీయ భాషలో చూడడానికే ప్రిఫర్ చేస్తారు. అలాంటప్పుడు ప్రతి భాష టీజర్ కి వ్యూస్ కూడా వేరేగా ఉంటుంది. అంటే వ్యూస్ ఇంకా లైక్స్ స్ప్లిట్ అవుతాయి.
ఒకసారి మనం పైన మల్టిపుల్ లాంగ్వేజెస్ లో విడుదలైన టీజర్ లని భాషకి, భాషకి కంపేర్ చేసి చూస్తే ఒక భాషలో ఉన్న టీజర్ వ్యూస్ ఇంకొక భాషలో ఉన్న టీజర్ కి ఉండవు. ఒక భాషలో విడుదలైన టీజర్ కి ఎక్కువ వ్యూస్ ఉండొచ్చు ఇంకొక భాషలో విడుదలైన టీజర్ కి కొంచెం తగ్గి ఉండొచ్చు . కేజిఎఫ్ 2 టీజర్ ఒకటే భాషలో విడుదలయ్యింది కాబట్టి అందరూ అదే టీజర్ చూస్తారు. కాబట్టి వ్యూస్ స్ప్లిట్ అవ్వవు.
అంతే కాకుండా టీజర్ లో ఉన్నది ఒకటే డైలాగ్. అది కూడా ఇంగ్లీష్ లో ఉంది. కాబట్టి ప్రత్యేకంగా డబ్బింగ్, లేదా వేరే భాషలో సపరేట్ గా విడుదల చేసే అవసరం లేదు. భాష ఏదైనా కూడా ఇంపాక్ట్ అలానే ఉంది. అందుకే యూట్యూబ్ లో తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్, లైక్స్ సాధించిన టీజర్ గా కేజిఎఫ్ 2 రికార్డ్ క్రియేట్ చేసింది.
End of Article