సుమ ఈమధ్య ఎక్కువ ప్రోగ్రామ్స్ లో కనిపించడం లేదేమిటి..? కారణం చెప్పేసిన భర్త రాజీవ్!

సుమ ఈమధ్య ఎక్కువ ప్రోగ్రామ్స్ లో కనిపించడం లేదేమిటి..? కారణం చెప్పేసిన భర్త రాజీవ్!

by Mounika Singaluri

సుమ.. టీవీ రంగంలో మకుటం లేని మహారాణి. కొన్ని సంవత్సరాలుగా యాంకరింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంటూ తన మాటల వాగ్దాటితో ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. స్టార్ మహిళ ప్రోగ్రాం 12 సంవత్సరాలు పాటు కొనసాగించి కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అలాగే సినిమా ప్రమోషన్స్ అనేసరికి అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు సుమ. సినిమాలు వేరు, యాక్టర్స్ వేరు, ప్రొడక్షన్స్ వేరు.

Video Advertisement

అయినప్పటికీ యాంకర్ గా మాత్రం సుమ ఉండాల్సిందే. అయితే ఈ మధ్యకాలంలో ఎందుకో సుమ పెద్దగా ప్రోగ్రామ్స్ చేయడం లేదు. సినిమా ప్రమోషన్స్ కాకుండా సుమ అడ్డా తప్పితే టీవీ ప్రోగ్రామ్స్ ఏవి ఆమె చేతిలో లేవు. అయితే దీనికి కారణం ఏమిటి ఆమెకి ప్రోగ్రాములు తగ్గిపోయాయా లేదంటే ఆమె కావాలనే తగ్గించుకుంటుందా అనే ప్రశ్న ప్రేక్షకులలో తలెత్తింది. అయితే ఈ మధ్య ఆమె భర్త, నటుడు అయిన రాజీవ్ కనకాల ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అందులో తన భార్య గురించి ఆమె ప్రోగ్రామ్స్ గురించి చెప్పుకొచ్చాడు.

సుమ తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా, మానసికంగా చాలా బలంగా తయారయ్యామని, తన తండ్రి చేసిన అప్పులను తీర్చేసి ఈ మాత్రం ఆర్థికంగా నిలదొక్కుకున్నామంటే అందుకు కారణం సుమ అని చెప్పుకొచ్చాడు రాజీవ్. ఇక బయట ఎంత బిజీగా ఉన్నప్పటికీ నన్ను,పిల్లలని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.

సాయంత్రం ఆరు తర్వాత కచ్చితంగా ఇంటికి వచ్చి మా కోసం టైం స్పెండ్ చేస్తుంది. ఇక ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే ఆమె కావాలనే ప్రోగ్రామ్స్ తగ్గించుకుంది. ఆమె తన సొంత ఛానల్ కోసం కష్టపడుతుంది, అందులో భాగంగానే బయట ప్రోగ్రామ్స్ తగ్గించుకోవలసి వచ్చింది అని సుమ గురించి చెప్పకొచ్చాడు రాజీవ్. ఏది ఏమైనప్పటికి చాలామంది మహిళలకు సుమ స్ఫూర్తి అనటంలో ఎలాంటి సందేహము లేదు.


You may also like

Leave a Comment