సరిలేరు నీకెవ్వరుతో 13ఏళ్ల తరువాత సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. ఇక నుంచి రాములమ్మ పాలిటిక్స్ ను వదిలి సినిమాలో నటిస్తుందని అంతా అనుకున్నారు ఎందుకంటే ఈ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించారు కాబట్టి ఇక రాజకీయాలు వదిలేసి సినిమాలు చేస్తారు అనుకున్నారు అభిమానులు. విజయశాంతి తాజాగా చేసిన ట్వీట్ తో సీన్ రివర్స్ అయ్యింది.

Video Advertisement

ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం… మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక సెలవు. మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అంటూ రాములమ్మ ట్వీట్ చేసింది. సరిలేరు_మీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్, కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరునీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.

సడన్‌గా ఆమె అలా అనేసరికి తెలుగు సినీ పరిశ్రమలో చర్చగా మారింది. ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఈ నేపథ్యంలో. సినిమాకి ముందు విజయశాంతి గారు ఓ ఇంటర్వ్యూలో ఇకపై వరస సినిమాలు చేస్తాను. పాత్ర నచ్చితే కచ్చితంగా నటిస్తాను. ఇన్నేళ్లు ఉన్న టెన్షన్ అంతా ఈ ఆర్నెళ్ళ పాటు జరిగిన సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ద్వారా తీరిపోయిందని చెప్పారు. మరి ఇప్పుడు సడెన్ గా ఇలా అంటారేంటి?

సరిలేరు నీకెవ్వరూ సినిమాలో విజయశాంతి పాత్రపై ఎన్నో కామెంట్స్ వచ్చాయి. కొందరు బాగుంది అంటే..కొందరు ఆమె స్థాయిలో లేవు అన్నారు. అంతేకాదు విజయశాంతి రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకోవడంతో నిర్మాతలు కూడా ఆమెను తీసుకోవడానికి కాస్త భయపడుతున్నారట. దీంతో రాములమ్మ మరోసారి రాజకీయాల్లోనే బెస్ట్ అనుకున్నట్టు ఉంది మరి.