హిందూ సంప్రదాయంలో దహన సంస్కారాలకు మహిళలు దూరంగా ఉండటానికి 4 కారణాలు ఇవే.!

హిందూ సంప్రదాయంలో దహన సంస్కారాలకు మహిళలు దూరంగా ఉండటానికి 4 కారణాలు ఇవే.!

by Mohana Priya

Ads

ఒక మనిషి పుట్టినప్పుడు తనని ప్రపంచంలోకి స్వాగతిస్తూ బారసాల, అన్నప్రాసన ఎలా చేస్తామో చనిపోయినప్పుడు ఆ మనిషికి చివరిసారిగా వీడ్కోలు పలుకుతూ, వేరే లోకాలకి చేరాలి అని ప్రార్థిస్తూ దహన సంస్కారాలు చేస్తాం. ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క రకంగా అంత్యక్రియలు చేస్తారు.

Video Advertisement

కొంతమంది పార్థివ శరీరాన్ని దహనం చేస్తారు మరికొంతమంది సమాధి లో పెడతారు. హిందూ సాంప్రదాయ ప్రకారం చనిపోయిన వ్యక్తి పార్ధివ శరీరాన్ని దహనం చేస్తారు. హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు అప్పుడు స్మశాన వాటిక కి ఆడ వాళ్ళు రారు. దీనికి నాలుగు కారణాలు ఉన్నాయి.

#1 మొదటి కారణం ఏంటంటే పూర్వం అంత్యక్రియల సమయం అప్పుడు ఇంట్లో భోజన ఏర్పాట్లు ఇంకా మిగిలిన ఏర్పాట్లు చేయడానికి ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్లు. అంతే కాకుండా ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు ,పిల్లలను చూసుకోవడానికి కూడా ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు.

#2 రెండవ కారణం ఏంటి అంటే ఆడవాళ్ళు భావోద్వేగాలను మగవాళ్ళ కంటే కొంచెం ఎక్కువగా వ్యక్తీకరిస్తారు. ఒకవేళ వారు స్మశానానికి వెళితే చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు అవుతున్నప్పుడు చూసి తట్టుకోలేక మానసికంగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అలా చాలాకాలం వరకు డిప్రెషన్ లో ఉంటారు.

#3 పైన చెప్పిన రెండు కారణాలు ప్రాక్టికల్ గా ఉంటే ఇప్పుడు చెప్పబోయే మూడవ కారణం శాస్త్రానికి సంబంధించినది. స్మశానంలో దుష్ట శక్తులు, దెయ్యాలు ఉంటాయట. అవి మహిళల్లో కి అదికూడా ముఖ్యంగా పెళ్లి కాని మహిళల్లో కి సులభంగా ప్రవేశించగలుగుతాయట.

అంతేకాకుండా గర్భవతిగా ఉన్న మహిళలు స్మశానం లోకి వస్తే దుష్ట శక్తుల ప్రభావం వారిపై పడే అవకాశం ఉండట. అందుకే గర్భవతులు అంత్యక్రియల కార్యక్రమానికి మాత్రమే కాకుండా పార్థివ శరీరం వద్దకు కూడా వెళ్లరు.

#4 ఇంకొక కారణం ఏంటి అంటే దుష్ట శక్తులు ఒక మనిషి లోకి ప్రవేశించడానికి ముఖ్యమైన మాధ్యమం జుట్టు అట. కాబట్టి అంత్యక్రియలు చేసి వచ్చిన తర్వాత స్మశానం లో ఉండే ఇతర ఏ చెడు శక్తులు ఒక మనిషి లోకి ప్రవేశించ కుండా ఆ మనిషి యొక్క జుట్టుని తీసేస్తారట. కాబట్టి ఒకవేళ ఆడవాళ్లకు తమ జుట్టును తీసేయడం లో ఎటువంటి అభ్యంతరం లేకపోతే దహన సంస్కారాలు కి వెళ్లొచ్చట.

పైన చెప్పిన కారణాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఎవరికీ తెలియదు. కానీ హిందూ సంప్రదాయం లో మాత్రం ఇప్పటికి కూడా ఆడవాళ్లు దహనసంస్కారాలు కి వెళ్ళకూడదు అని నియమాన్ని పాటిస్తారు.


End of Article

You may also like