హైదరాబాద్ లో 180 పైగా చెరువులు ఉన్నాయి అని తెలుసా మీకు ? హైదరాబాద్ లో చెరువుల దుస్థితి ఇది…

హైదరాబాద్ లో 180 పైగా చెరువులు ఉన్నాయి అని తెలుసా మీకు ? హైదరాబాద్ లో చెరువుల దుస్థితి ఇది…

by Mohana Priya

Ads

గత కొంత కాలం నుండి లాక్ డౌన్ కారణంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రాని ప్రజలు, ఇప్పుడు కొంచెం రూల్స్ సడలించడం తో ఎప్పటిలాగా కాకపోయినా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే బయటికి వెళ్ళడం మొదలు పెట్టారు. కానీ ఇటీవల వచ్చిన వరదల కారణంగా ప్రజలందరూ మళ్లీ ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు రెండు రోజులు ఆగకుండా కురిసిన వర్షం తో, వరద నీరు మొత్తం రోడ్లపై నిలిచిపోయింది.
అంతే కాకుండా చాలా ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లల్లోకి కూడా వెళ్లి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు భారీ వర్షాల కారణంగా విద్యుత్ తీగలు పడిపోవడం, లేదా ట్రాన్స్ఫార్మర్ల లో సమస్యలు రావడం వల్ల చాలా ప్రాంతాల్లో పవర్ కట్ సమస్య కూడా ఎదురైంది.
అయితే ఇలా అవ్వడానికి ముఖ్య కారణం చెరువులని ఆక్రమించుకోవడం. అలా చెరువులపై ఎన్నో కట్టడాలను కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు అని, అలాగే ఈ కన్స్ట్రక్షన్ లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు చాలా చెరువులు ఉండేవట.
ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు. అంటే ఒక ప్రదేశంలో చెరువు నిండి పోయి నీళ్లు బయటికి వస్తూ ఉంటే ఆ వృధా నీరు మరో ప్రదేశంలోని చెరువు లోకి, లేదా కుంటల్లోకి వెళ్తాయి. సిటీ ఎక్స్పాన్షన్ జరిగిన కొద్ది, చెరువులన్నీ అంతరించిపోయాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్,  హుస్సేన్ సాగర్ లతో పాటు ఉన్న చెరువులు ఇవే.
మీర్ ఆలం చెరువు
తలాబ్ కట్ట చెరువు
మంత్రాల చెరువు,
కొత్త చెరువు,
ఐడీపీఎల్ చెరువు,
హస్మత్‌ పుర చెరువు,
బాలాజీనగర్ చెరువు,
కౌకూర్ చెరువు,
సూరారం చెరువు,
లింగం చెరువు,
వెన్నెలగడ్డ చెరువు,
ప్రగతినగర్ చెరువు,
కాప్రా చెరువు,
కీసర చెరువు,
పూడురు చెరువు,
ఎల్లమ్మపేట చెరువు,
మేకంపూర్ చెరువు,
నల్లచెరువు,
పల్లె చెరువు,
దుర్గం చెరువు,
రామంతపూర్ చెరువు,
సఫీల్ గూడ చెరువు,
అల్వాల్ చెరువు,
సరూర్ నగర్ చెరువు,
అమీనాపూర్ చెరువు,
జీడిమెట్ల చెరువు,
బంజారా చెరువు (బంజారాహిల్స్)
షామీర్ పేట్ చెరువు
నారాయణరెడ్డి కత్వా,
బాచారం కత్వా,
హీరా కత్వా,
రాయి‌ చెరువు,
మాలోనికుంట,
అంట్ల మైసమ్మ కుంట,
మైసమ్మ చెరువు,
పెద్ద చెక్‌ డ్యాం,
మెట్టు కత్వా,
బుంగ కత్వా,
బూబాగడ్డ చెక్‌ డ్యాం,
ఎర్రబండ చెక్‌డ్యాం,
బంధం కుంట,
బైరాం ఖాన్‌ చెరువు,
ఈదుల చెరువు,
దిల్‌వార్ ‌ఖాన్‌ చెరువు,
పోల్కమ్మ చెరువు,
అంతాయపల్లి చెరువు,
కుంట్లూర్‌ చెరువు,
కంబాలకుంట,
మాసబ్‌ చెరువు,
వడ్లకుంట,
కొత్త చెరువు,
బందకుంట,
అమీర్‌ పేట,
యూసుఫ్ ‌గూడ చెరువు,
శ్యామలకుంట (సనత్‌నగర్)‌,
మైసమ్మకుంట,
చాపల చెరువు
ఇవి మాత్రమే కాకుండా తుమ్మల కుంట, చింతలకుంట, పుప్పలకుంట, కూర్మ చెరువు, కుత్బుల్లాపూర్‌ చెరువు, కోమటికుంట, కోమార్ ‌కుంట, గొల్లవాని కుంట, భజన్ ‌సాహికుంట, బొంగలకుంట, షాన్‌ కీసమున కుంట, హెచ్‌ఎంటి కాలనీ చెరువు, క్వారీ కుంట, క్యామ్‌లాల్‌ లే అవుట్‌ చెరువు, బండకుంట, సుదర్శన్‌ చెరువు, అంజయ్య చెరువులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 180 కి పైగానే ఉంటాయి. ఇప్పుడు అసలు ఈ చెరువుల జాడ కూడా లేదు.

End of Article

You may also like