ఈ చిన్న తప్పే సింగర్ “సాయి చంద్” మృతికి కారణమా..? ఇలా చేయకపోయి ఉంటే..?

ఈ చిన్న తప్పే సింగర్ “సాయి చంద్” మృతికి కారణమా..? ఇలా చేయకపోయి ఉంటే..?

by kavitha

Ads

తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన పాత్రను పోషించిన సింగర్ సాయిచంద్ హార్ట్ అటాక్ తో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సాయిచంద్ 39 సంవత్సరాల వయసులోనే మరణించడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా విషాదం నెలకొంది.

Video Advertisement

నాగర్ కర్నూల్ జిల్లాలోని కారుకొండలని ఫామ్ హౌస్‌కు వెళ్ళిన సాయిచందర్ కు అక్కడే గుండెపోటు రావడంతో సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, డాక్టర్లు మరణించినట్లు చెప్పారు. సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ సాయిచంద్ మరణం పట్ల స్పందించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

గాయకుడు సాయిచంద్‌ స్వస్థలం వనపర్తి జిల్లాలోని అమరచింత. సాయిచంద్‌ విద్యార్థి దశ నుండే సింగర్ గా మంచి పేరును పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాయిచంద్‌ తన పాటలతో అందరిలో స్ఫూర్తిని రగిలించారు.  జానపద పాటలతో వచ్చిన పలు టెలివిజన్ షోలలో సాయిచంద్‌ పాల్గొన్నారు. ఉద్యమ కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయిచంద్‌ను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్ పదవిని ఇచ్చి, గౌరవించింది. ఇటీవల జరిగిన అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవ వేడుకలో కూడా సాయిచంద్‌ పాల్గొన్నారు.

ఫామ్ హౌస్‌కు వెళ్ళిన సాయిచంద్ కు అక్కడే గుండెపోటు రావడంతో బుధవారం రాత్రి ఆయన భార్య, గన్‌మెన్, డ్రైవర్ కలిసి సాయిచంద్ ను నాగర్‌కర్నూల్‌ లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయన కండిషన్  విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న కేర్ ఆసుపత్రికి తరలించారు. కానీ డాక్టర్లు ఆయన మరణించినట్లు ప్రకటించారు. సాయిచంద్‌ బౌతీక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సాయిచంద్ మరణం పై సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ తాజాగా స్పందించారు. సాయిచంద్ హార్ట్ అటాక్ రాగానే ప్రైవేట్ హాస్పిటల్‌ తీసుకెళ్లారని, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం కేర్ హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగానే ఆయన కన్నుమూశారని అయితే ఆయనను ప్రైవేట్ వెహికిల్ లో కాకుండా అంబులెన్స్ లో తీసుకెళ్ళాల్సింది. అంబులెన్స్ లో సీపీఆర్ చేయడానికి అనువుగా ఉంటుందని, ఆటోమెటెడ్ ఎక్స్‌టర్నర్ డిఫిబ్రిలేటర్స్ వాడటం వల్ల మరణించే అవకాశం తగ్గుతుందన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..

Also Read: ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు… కన్న కొడుకుని..? కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!


End of Article

You may also like