హీరో విజయ్ ఆంటోని కూతురు ఆ-త్మ-హ-త్య ఎందుకు చేసుకుంది..? కారణం ఇదేనా..?

హీరో విజయ్ ఆంటోని కూతురు ఆ-త్మ-హ-త్య ఎందుకు చేసుకుంది..? కారణం ఇదేనా..?

by kavitha

Ads

తమిళ స్టార్ హీరో, దర్శకుడు, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. విజయ్ ఆంటోని కుమార్తె ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెను హస్పటల్ కు తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్టుగా వైద్యులు వెల్లడించారని తెలుస్తోంది.

Video Advertisement

ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే అమ్మాయి బలవన్మరణానికి పాల్పడి, ప్రాణాలు తీసుకోవడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు విజయ్ ఆంటోనికి ఫోన్ చేసి సంతాపం తెలుపుతున్నారు.  ఈ క్రమంలో గతంలో బలవన్మరణానికి పాల్పడడం పై విజయ్ ఆంటోని మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ గా మారాయి.
విజయ్ ఆంటోనీ తన ఫ్యామిలితో కలిసి చెన్నైలో డీడీకే రోడ్డులో నివసిస్తున్నారు. విజయ్ కుమార్తె పేరు మీరా ఆంటోనీ. ఆమె చర్చ్ పార్క్ స్కూల్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. 16 ఏళ్ల మీరా ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఆమె గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను గమనించిన ఫ్యామిలీమెంబర్స్ సమీపంలోని కావేరీ హాస్పటల్ కి తరలించారు. అయితే అప్పటికే మీరా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు మీరా మృతిని ఆ-త్మ-హ-త్య-గా కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన జరిగిన టైమ్ లో విజయ్‌ ఆంటోని ఇంట్లో లేరని అంటున్నారు.మీరా మరణానికి కారణం చదువుల్లో ఒత్తిడి అని తెలుస్తోంది. అయితే ఈ వార్తల పైన, తన కుమార్తె మీరా చనిపోవడం పైన విజయ్ ఆంటోని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకనట చేయలేదు. కుమార్తె చనిపోయి, బాధలో ఉన్న విజయ్ ఆంటోనికి ప్రముఖులు, ఫ్యాన్స్ ధైర్యాన్ని చెబుతున్నారు. మీరా మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే గతంలో బలవన్మరణం ఆలోచనల గురించి విజయ్ ఆంటోని మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు బలవన్మరణంకు ఎందుకు పాల్పడుతారు?  అలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి అనే విషయం పై మాట్లాడారు. “ఎవరినైనా అతిగా నమ్మి మోసపోవడం,  కమిట్మెంట్ ఇచ్చి, ఆ పనిని చేయలేకపోవడం, చదువుకునే పిల్లలకు చదువుల వల్ల కలిగే ఒత్తిడితో ఇలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పుకొచ్చాడు. బడి నుంచి వచ్చిన తరువాత పిల్లల్ని ట్యూషన్‌కి పో అంటూ ఉంటాం. పిల్లలను సొంతంగా ఆలోచించే అవకాశం ఇవ్వడం లేదు. పిల్లలను కొంచెం ఫ్రీగా వదిలేయాలని” చెప్పుకొచ్చాడు. విజయ్ ఆంటోని కూడా తన కుమార్తె చదువు విషయంలో ఒక కామన్ ఫాదర్ లానే ప్రవర్తించాడా? అందువల్లే ఒత్తిడికి గురై ఆమె ప్రాణం తీసుకుందా అని అంటున్నారు.

Also Read: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన 7/జి బృందావన్ కాలనీ హీరో..? ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?


End of Article

You may also like