బాలకృష్ణని అపార్థం చేసుకున్నారా..? ఫ్లెక్సీ తీసేయమనడానికి అసలు కారణం ఇదేనా..?

బాలకృష్ణని అపార్థం చేసుకున్నారా..? ఫ్లెక్సీ తీసేయమనడానికి అసలు కారణం ఇదేనా..?

by Mounika Singaluri

Ads

ఈరోజు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించడానికి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇతర నందమూరి కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. అయితే తర్వాత వచ్చిన బాలకృష్ణ రావడంతోటే అక్కడ పెట్టిన ఎన్టీఆర్ బ్యానర్లను తీసేయమని పక్కన ఉన్న సిబ్బందితో చెప్పారు.

Video Advertisement

వెంటనే సిబ్బంది ఆ బ్యానర్లను తొలగించారు.ఈ విషయం వెంటనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

balakrishna comments at ntr ghat

ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణను నిందిస్తూ నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు బాలయ్యకి ఎన్టీఆర్ కి పడటం లేదని అందుకే బాలయ్య ఇలా బ్యానర్ లు తీయించేసారని రాసుకోచ్చారు. అయితే బాలయ్య బ్యానర్లు తీసేయమనడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలిసింది. అక్కడ జరుగుతుంది సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం. కానీ ఎన్టీఆర్ అభిమానులు పెట్టిన బ్యానర్లు దానికి సంబంధం లేకుండా ఉన్నాయి. వర్ధంతి కార్యక్రమమైతే స్వాగతం సుస్వాగతం బ్యానర్లు పెట్టారు.

reason why balakrishna ordered to remove banner

కార్యక్రమానికి సంబంధాలు లేకుండా బ్యానర్లు పెట్టడంతో కోపం వచ్చిన బాలయ్య ఆ బ్యానర్లు తీసేయమని చెప్పారు. అంతే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. దీంతో బాలయ్య మధ్య ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని పలువురి నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు


End of Article

You may also like