Home Bigg Boss 5 telugu Bigg Boss Telugu-5: ఈ 5 కారణాల వల్లే “అనీ మాస్టర్” ఎలిమినేట్ అయ్యారా.?

Bigg Boss Telugu-5: ఈ 5 కారణాల వల్లే “అనీ మాస్టర్” ఎలిమినేట్ అయ్యారా.?

by Mohana Priya

బిగ్ బాస్ మొదలయ్యి ఇప్పటికి 10 వారాలు అంటే దాదాపు 78 రోజులు గడిచింది. మొదటి నాలుగు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ టీఆర్పీ కొంచెం తక్కువగా ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది ఎలిమినేషన్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బయటికి వెళ్లిపోవడం గమనార్హం.

ఇటీవల జరిగిన ఎలిమినేషన్ లో అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. అయితే, అనీ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే అంటూ కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

reasons behind anee master elimination in bigg boss telugu 5

# తెలియకుండానే రవి, శ్రీరామ్ మాటలు అనీ మాస్టర్ పై ప్రభావం చూపాయి. తన గేమ్ తీరు కూడా తర్వాత మారిపోయింది.

reasons behind anee master elimination in bigg boss telugu 5

# కాజల్ తో జరిగిన గొడవ ఎన్నో చర్చలకు దారి తీసింది. కాజల్ ని వెక్కిరించడం అదంతా హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా అంత పెద్దగా నచ్చలేదు.

reasons behind anee master elimination in bigg boss telugu 5

# జెస్సీతో ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత అనీ మాస్టర్ గేమ్ మారిపోయింది. అంతే కాకుండా, శ్రీరామ్ రవి మధ్య జరిగే డిస్కషన్స్ లో అనీ మాస్టర్ ఎక్కువ పాల్గొన్నారు. దాంతో మిగిలిన సభ్యులతో సరిగ్గా మాట్లాడలేకపోయారు. దాంతో మిగిలిన సభ్యులతో అనీ మాస్టర్ కి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది.

reasons behind anee master elimination in bigg boss telugu 5

# మిగిలిన కంటెస్టెంట్స్ తో అనీ మాస్టర్ మాట్లాడే విధానం. ముఖ్యంగా టాస్క్ ఆడేటప్పుడు వేరే వాళ్లని ఇమిటేట్ చేస్తాను, అలాగే విశ్వతో తనని అక్కా అని పిలవొద్దు అని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక కారణం అయ్యాయి.

reasons behind anee master elimination in bigg boss telugu 5

# మొదటి నుంచి కూడా అనీ మాస్టర్ ఓటింగ్ లో టాప్ లో లేరు. కాజల్ కూడా అంతకు ముందు అదే స్థానంలో ఉండేవారు. కానీ కాజల్ తర్వాత మెల్లగా తన గేమ్ లో ఇంప్రూవ్ అవుతూ వెళ్లారు. అనీ మాస్టర్ గేమ్ లో మాత్రం అంత పెద్ద ఇంప్రూమెంట్ కనిపించలేదు అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

reasons behind anee master elimination in bigg boss telugu 5

ఈ కారణాల వల్లే అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి ఉంటారు అని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

You may also like