Home Filmy Adda “లైగర్” సినిమాపై నెగిటివిటీకి… ఈ 4 విషయాలే కారణమా..?

“లైగర్” సినిమాపై నెగిటివిటీకి… ఈ 4 విషయాలే కారణమా..?

by Mohana Priya

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా కోసం భారతదేశం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సినిమా బృందం ఇప్పటికే ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది.

అలాగే కొన్ని పాటలు కూడా విడుదల అయ్యాయి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే, మొదటి నుండి కూడా ఈ సినిమాపై కొంత నెగిటివిటీ ఉంది. ఈ సినిమాపై ఆసక్తి ఎంత ఉందో, అంటే నెగిటివ్ గా కూడా ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. అందుకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

minus points in vijay devarakonda liger trailer

#1 సినిమా మొదటి పోస్టర్ విడుదల తర్వాత పాపులారిటీ రావడంతో పాటు ట్రోలింగ్ కూడా చాలానే జరిగింది. అందుకు కారణం పోస్టర్ విడుదల తర్వాత విజయ్ దేవరకొండ పేరు టాటూ వేయించుకుని, అలాగే పోస్టర్ కి బీర్ తో అభిషేకం చేస్తూ ఉన్న వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. అవి కొంచెం అతిగా అనిపించాయి.

minus points in vijay devarakonda liger trailer

#2 సరే ఇంత పబ్లిసిటీ జరిగిన తర్వాత వచ్చిన ట్రైలర్ ఏదైనా అంచనాలను అందుకున్నట్లు ఉందా అంటే అది కూడా లేదు అనే కామెంట్స్ వచ్చాయి. చాలా మంది అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమాతో పోల్చారు. అసలు ట్రైలర్ లో హై అనిపించే ఒక్క సీన్ కూడా లేదు అని అంటున్నారు. పూరి మార్క్ ఎక్కడా కనిపించలేదు అనే కామెంట్స్ వచ్చాయి. ట్రైలర్ లో చూపించిన కథ కూడా పెద్ద కొత్తగా ఏమీ అనిపించలేదు.

minus points in vijay devarakonda liger trailer

#3 అసలు ఒక సినిమా ప్రేక్షకులకి రీచ్ అవ్వాలంటే, ముందు ఆ సినిమా పాటలు బాగుండటం చాలా ముఖ్యమైన విషయం. ఈ సినిమా విషయంలో మాత్రం అది జరగలేదు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు ఒక్కటి కూడా మన ప్రేక్షకులకి తగ్గట్టు లేవు. ఏదో హిందీ పాటలు తెలుగులో డబ్ చేసినట్టు ఉన్నాయి. తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమా తీశారు అని అన్నారు. కానీ పాటలు చూస్తుంటే మాత్రం వాళ్ల లిప్ సింక్ హిందీలో ఉంది. దాంతో అసలు ఇది తెలుగు సినిమానేనా అనే డౌట్ కూడా వస్తోంది.

#4 ప్రస్తుతం సినిమా బృందం చాలా ప్రదేశాలకి వెళుతూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సిటీల్లో అంటే సరే, మిగిలిన చోట్ల కూడా సినిమా బృందం ఎక్కడికి వెళితే అక్కడ గుంపులుగుంపులుగా జనాలు వస్తున్నారు. దాంతో సినిమా బృందం ప్రమోషన్స్ మధ్యలో ఆపేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాకి కూడా ఇలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దాంతో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని వాళ్లంతా నిజంగా వచ్చిన జనాలు కాదు అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. “సౌత్ ఇండియాలో అంటే సరే, కానీ నార్త్ ఇండియాలో కూడా ఇలా అవుతోంది అంటే, అక్కడ అంత పెద్ద స్టార్ ఏమీ కాదు కదా? నిజంగా వాళ్ళందరూ హీరో హీరోయిన్లని చూడడానికే వస్తున్నారా?” అనే కామెంట్స్ వస్తున్నాయి.

reasons behind negativity on liger movie

ఇన్ని విషయాల మధ్య కూడా ఈ సినిమా గురించి ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకుంటుందో లేదో? నిజంగానే ఈ సినిమాలో అంత గొప్ప విషయం ఏంటి అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

You may also like