Home Bigg Boss 5 telugu Bigg Boss Telugu-5: ఈ “3” కారణాల వల్లే రవి బిగ్‌బాస్ నుండి ఎలిమినేట్ అయ్యారా..?

Bigg Boss Telugu-5: ఈ “3” కారణాల వల్లే రవి బిగ్‌బాస్ నుండి ఎలిమినేట్ అయ్యారా..?

by Mohana Priya

బిగ్ బాస్ లో ఎవరు ఊహించని విధంగా రవి ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్స్ వరకు వస్తారు అనుకున్న కంటెస్టెంట్స్ లో రవి ఒకరు. కానీ రవి ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

“మా ఓట్లు మీద ఎలిమినేట్ అయ్యే వారిని నిర్ణయించనప్పుడు మేము ఓట్లు వెయ్యడం ఎందుకు? అసలు ఓటింగ్ పెట్టడం ఎందుకు?” అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రవి కూడా తాను ఎలిమినేట్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అని బిగ్ బాస్ బజ్ లో చెప్పారు. ఇదిలా ఉండగా రవి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే అని సోషల్ మీడియాలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

anchor ravi

# మొదటి నుండి రవి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్నారు. కానీ ఎపిసోడ్స్ ముందుకు వెళ్లే కొద్దీ రవి స్లో అయ్యారు. టాస్క్ ఆడడం నుండి, మిగిలిన అన్ని విషయాల్లో కూడా రవి చాలా నెమ్మదిగా ఉన్నారు.

reasons behind ravi elimination in bigg boss telugu 5

# మొదటి నుండి కొంచెం నెగిటివిటీ ఎదుర్కొన్న కాజల్, తర్వాత తర్వాత తన గేమ్ లో ఇంప్రూమెంట్ చూపించారు. దాంతో ప్రేక్షకులు కూడా కాజల్ కి ఓటు వేయడం మొదలుపెట్టారు. అలా కాజల్ చాలా మంది కంటెస్టెంట్స్ ని దాటి ముందుకు వెళ్లారు. కాజల్ పాపులారిటీ పెరగడం కూడా ఒక కారణమని అంటున్నారు. దాంతో రవి నెమ్మదించడంతో, అందులోనూ రవితో పాటు డేంజర్ జోన్ లో ఉన్నది కాజల్ అవ్వడంతో ఎలిమినేషన్ వరకు వచ్చారు.

ravi comments about shannu siri relationship

# మరొక కారణం ఏంటంటే నెగిటివ్ కామెంట్స్. కొన్నిసార్లు రవి ఒకటి చేయాలని ప్రయత్నిస్తే అది ఒకటి అవ్వడం, అవన్నీ చర్చలకు దారి తీయడం వల్ల నెగిటివిటీ పెరిగిపోయింది. రవి మంచి చేద్దామని ప్రయత్నించినా కూడా, కొన్నిసార్లు అది అనుకున్న విధంగా జరగలేదు.

reasons behind ravi elimination in bigg boss telugu 5

ఇవన్నీ కూడా ఎలిమినేషన్ కి కారణం అయ్యాయి అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

You may also like