Ads
ఎంతో కాలం ఎదురు చూసిన తర్వాత భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో హీరోలుగా నటిస్తున్న పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు హీరోయిన్‌గా నటిస్తున్న నిత్యా మీనన్, మురళీ శర్మ, రావు రమేష్, మరొక హీరోయిన్‌గా నటిస్తున్న సంయుక్త మీనన్ కూడా కనిపించారు.
Video Advertisement
ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్‌గా రూపొందించబడింది. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు. అయితే ట్రైలర్ విడుదల అయిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అందుకు కారణం ట్రైలర్ నుండి చాలా ఊహించుకున్నారు. ట్రైలర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది అని, ఇంక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా ఉండదు అని అనుకున్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులకి అలా అనిపించలేదు. భీమ్లా నాయక్ ట్రైలర్ కి నెగిటివ్ టాక్ రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా మీద కూడా అలాగే ఉన్నాయి. వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుంది అనే ఒక నమ్మకం వచ్చింది. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం అంత హైప్ క్రియేట్ అవ్వడం లేదు. అలాగే ట్రైలర్ లో కూడా చాలా వరకూ మనకి అంతకుముందు విడుదలైన వీడియోల్లో, పోస్టర్స్ లో చూపించిన షాట్స్ మాత్రమే ఉన్నాయి.
#2 ఇది ఒక మలయాళ సినిమాకి రీమేక్. ఆ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇద్దరు హీరోలని సమానంగా చూపించారు. పేరులో కూడా ఇద్దరు హీరోల పేర్లు ఉంటాయి. కానీ తెలుగులో కేవలం ఒక్క హీరో పేరు మాత్రమే టైటిల్ లో పెట్టారు. మలయాళం సినిమా చాలా మంది తెలుగు ప్రేక్షకులు కూడా చూశారు. చాలా మంది తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సంవత్సరం విడుదలైన బెస్ట్ మలయాళం సినిమాల్లో అది ఒకటి అని అన్నారు. భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన తర్వాత మలయాళం సినిమా ఉన్నట్టు ఇది ఉండదు ఏమో అని కామెంట్స్ వస్తున్నాయి.
#3 ఈ సినిమాలో ముందు నుంచి కూడా కథ విషయంలో చాలా మార్పులు జరిగాయి అని చెప్తూనే ఉన్నారు. ఇది కేవలం ఈ ఒక్క సినిమా విషయంలో మాత్రమే కాదు రీమేక్ విషయాల్లో జరుగుతూనే ఉంటాయి. కానీ మలయాళం సినిమాలో ప్రేక్షకులందరికీ ఎక్కువగా నచ్చినదే కథ. ఆ ఇద్దరు హీరోలు కూడా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ, లేదా ఒకరు హీరో ఒకరు విలన్ అని కాకుండా స్క్రీన్ స్పేస్ సమానంగా ఉంటుంది. అంతే కాకుండా మలయాళం సినిమాతో పోలిస్తే దాదాపు 30 నిమిషాల నిడివి మన తెలుగు సినిమాలో తగ్గింది. దాంతో, “ఒకవేళ మార్పులు చేస్తే చేశారు కానీ, ఆ మార్పులు సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపకపోతే చాలు” అని అంటున్నారు.
#4 అసలు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమా పాటలు ఆల్రెడీ విడుదలై హిట్ అయ్యాయి. అంతే కాకుండా అంతకు ముందు సినిమాకి సంబంధించి విడుదల చేసిన వీడియోస్ లో కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యింది. దాంతో ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది అని అనుకున్నారు. కానీ ట్రైలర్ చూస్తే చాలా ప్లెయిన్ గా అనిపించింది. ఒక్క చోట కూడా మ్యూజిక్ పవర్ ఫుల్ గా లేదు. కానీ ఏదేమైనా సినిమాలో మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు చాలా బాగుంటాయి అనే టాక్ వినిపిస్తోంది.
#5 ట్రైలర్ లో కూడా కొన్ని పంచ్ డైలాగ్స్ ఉంటాయి అనుకున్నారు. అనుకున్నట్టుగానే కొన్ని ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కువగా ఉంటాయి అని ప్రేక్షకులు ఊహించారు. ఇవన్నీ మాత్రమే కాకుండా సినిమాకి ప్రమోషన్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. సినిమా బృందం ప్రస్తుతానికైతే ఎక్కడ సినిమాని ప్రమోట్ అయితే చేయలేదు. సినిమా విడుదలకి కూడా చాలా తక్కువ సమయం ఉంది. దాంతో, “సినిమాకి సంబంధించిన బృందంలో నుండి ఎవరో ఒకరు కనీసం ఒక ఇంటర్వ్యూ అయినా ఇస్తే సినిమా గురించి, స్టోరీ ఎలా ఉండబోతోంది అనే విషయం గురించి కొంచెం ప్రేక్షకులకి ఇంకా బాగా తెలుస్తుంది” అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
కొంత మంది ఈ విధంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంత మంది నెటిజన్లు మాత్రం, “ట్రైలర్ చూసి ఏమీ చెప్పలేము” అని, “సినిమా విడుదల అయిన తర్వాత ఖచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది” అని అంటున్నారు.
End of Article