Ads
ఎన్నో రోజులు ఎదురు చూసిన తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా గురించి ఇప్పుడు కాదు దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
సినిమా ప్రకటించినప్పటి నుండి కూడా ఈ సినిమా విడుదల అయిన తర్వాత పూరి జగన్నాధ్ కి పాన్ ఇండియన్ స్థాయిలో గుర్తింపు వస్తుంది అని, అలాగే విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ అవుతారు అని అందరూ అన్నారు. కానీ సినిమాకి సంబంధించి పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా మెల్లగా ఒకొక్కటి చూసిన తర్వాత ఇది “అసలు తెలుగు సినిమానేనా?” అని అనుమానం కూడా వచ్చింది. అసలు ఈ సినిమాకి ఇంత నెగిటివ్ టాక్ రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 అసలు సినిమాని కేవలం తెలుగులో రిలీజ్ చేస్తే బాగుండేదేమో. అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు అంటే అంత కంటెంట్ ఉన్న సినిమా అని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ సినిమా మాత్రం చాలా రొటీన్ స్టొరీ ఉన్న కమర్షియల్ సినిమాలాగా ఉంది.
#2 సినిమాకి ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. సినిమా బృందం అంతా కూడా సినిమా మామూలుగా ఉండదు అని చెప్పారు. 200 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది అని అన్నారు. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం, “అంత చెప్పారు కదా? సినిమా ఏంటి ఇలా ఉంది?” అని అనిపిస్తుంది. అసలు వాళ్ళు చెప్పినదానికి సినిమాకి సంబంధం లేదేమో అని అనిపిస్తుంది. ఒకరకంగా మరీ ఎక్కువగా ప్రమోట్ చేయడం ఈ సినిమాకి మైనస్ అయ్యిందేమో అనిపిస్తుంది.
#3 సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వాలి అంటే అందులో ముఖ్యమైనవి పాటలు. ఈ విషయం అసలు సినిమా బృందం పట్టించుకోలేదు. పాటలు అన్నీ కూడా ఏదో హిందీలో చిత్రీకరించి తెలుగులో డబ్ చేసినట్టు ఉంటాయి. పాటలు మాత్రమే కాదు. సినిమాలో చాలా వరకు కూడా అందులో ఉన్న పాత్రలు హిందీ మాట్లాడుతూ ఉంటారు. అదే తెలుగులో డబ్ చేశారు అని అర్థం అయిపోతుంది. సినిమా తెలుగు, హిందీ రెండు భాషల్లో తీసాం అని చెప్పారు కానీ చూస్తే అది హిందీ సినిమా తెలుగులో డబ్ చేసారు అనిపిస్తుంది.
#4 అంత పెద్ద బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో నటిస్తున్నారు అంటే ఎంత మంచి రోల్ చేస్తున్నారో అని అనుకున్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర మైక్ టైసన్ పాత్రని కొట్టడం చూసే వారికి ఏమాత్రం నచ్చలేదు. అంత పెద్ద సెలబ్రిటీని పెట్టి ఇలాంటి రోల్ ఎందుకు చేయించారు అని అంటున్నారు.
#5 సినిమాలో చాలామంది నార్త్ ఇండియన్ నటులు ఉన్నారు. తెలుగు వాళ్ళు చాలా తక్కువ. అందులో చాలామంది మాట్లాడుతున్నా, తెరపై కనిపిస్తే కూడా చిరాకు వస్తుంది. హీరోయిన్ అనన్య పాండే వచ్చిన సీన్స్ మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలాగానే ఉన్నాయి.
హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డారు అని తెలుస్తోంది. అలాగే మిగిలిన కథ కూడా బాగుండి ఉంటే సినిమా ఫలితం వేరే లాగా ఉండేది అని అంటున్నారు.
End of Article