Ads
సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు మహేష్ బాబు. బాల నటుడిగా ఆయన 8 కి పైగా చిత్రాల్లో నటించాడు. కథానాయకుడిగా 25 కి పైగా చిత్రాల్లో నటించాడు. హీరోగా చేసిన మొదటి సినిమా ‘రాజ కుమారుడు’ చిత్రం తోనే ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు గెలుచుకున్నాడు మహేష్. అయితే చాలా తక్కువ సమయం లోనే సూపర్ స్టార్ గా మారాడు మహేష్ బాబు.
Video Advertisement
మహేష్ సూపర్ స్టార్ కావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఆయన కష్టపడే తత్త్వం, తర్వాత ఆయన సినిమాల ఎంపిక.. మహేష్ చేసిన చిత్రాల్లో వైవిధ్యం ఉండేలా చూసుకుంటాడు. లుక్స్ విష్యం లో పెద్దగా వేరియేషన్స్ చూపించనప్పటికీ .. తన సినిమాల్లో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేష్.
ఇప్పుడు మహేష్ చేసిన వైవిధ్యమైన చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం..
#1 టక్కరి దొంగ – కౌ బాయ్ మూవీ
తన తండ్రి ట్రెండ్ సృష్టించిన కౌ బాయ్ సినిమా నే మహేష్ కూడా చేసాడు. ఇందులో బిపాసా బసు, లీసా రే హీరోయిన్లు.
#2 మురారి – సోషియో ఫాంటసీ
ఒక శాపం మూలం గా దెబ్బ తిన్న వంశం లో పుట్టిన హీరో ఆ శాపాన్ని ఎలా తప్పించుకున్నాడన్నదే ఈ సినిమా.
#3 నాని – సైన్స్ ఫిక్షన్
ఈ సైంటిఫిక్ ఫిక్షనల్ చిత్రం లో మహేష్ ద్వి పాత్రాభినయం చేసాడు.
#4 నిజం – డ్రామా
తండ్రిని చంపినా హంతకులను చంపేందుకు సిద్దమైన తల్లి కొడుకుల కథ ఈ చిత్రం.
#5 ఖలేజా – కామెడీ
దేవుడికి నిజమైన అర్థం ఏంటో చూపించిన చిత్రం ఇది.
#6 పోకిరి – యాక్షన్ మూవీ
మహేష్ ఫస్ట్ టైం కంప్లీట్ మాస్ రోల్ చేసిన చిత్రం ఇది.
#7 ఒక్కడు – స్పోర్ట్స్
మహేష్ చేసిన స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ ఈ చిత్రం.
#8 అర్జున్ – సెంటిమెంట్
సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన చిత్రం అర్జున్.
#9 1 నేనొక్కడినే – సైకలాజికల్ థ్రిల్లర్
ఈ చిత్రం లో మెదడుకు సంబంధించిన ఒక అరుదైన వ్యాధితో మహేష్ బాధపడుతూ ఉంటాడు.
#10 బిజినెస్ మాన్ – నెగటివ్ షేడ్స్
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం లో పూర్తి నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు మహేష్.
#11 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – మల్టి స్టారర్
తెలుగులో మల్టీ స్టారర్ ట్రెండ్ ని రీ స్టార్ట్ చేసిన చిత్రం ఇది.
#12 శ్రీమంతుడు – సోషల్ మెసేజ్
గ్రామాలను దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం చాలా మందికి ప్రేరణ కలిగించింది.
End of Article