“రజాకార్” సినిమాని ఎందుకు నిషేధించాలి అంటున్నారు..? అసలు ఏం ఉంది ఇందులో..?

“రజాకార్” సినిమాని ఎందుకు నిషేధించాలి అంటున్నారు..? అసలు ఏం ఉంది ఇందులో..?

by kavitha

Ads

‘రజాకార్’ మూవీ టీజర్ గత నెలలో రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ లో హైదరాబాద్ సంస్థానంలో రజాకర్లు చేసిన దారుణాల గురించి చూపించారు. ఈ టీజర్ పై నెటిజన్లు, రాజకీయ పార్టీలు, మత పెద్దలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ విషయం పై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.

Video Advertisement

ఈ టీజర్ తెలంగాణలో పాలిటిక్స్ లో దుమారం రేపుతోంది. సీపీఎం పార్టీ నాయకులు రిలీజ్ కాబోతున్న రజాకార్ మూవీని తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఈ సినిమా ఏమిటి ? ఎందుకు దీన్ని నిషేధించాలి అంటున్నారో ఇప్పుడు చూద్దాం..

రజాకార్ సినిమాను యాటా సత్యనారాయణ తెరకెక్కిస్తుండగా, బిజీపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న వేళ ఈ చిత్రం కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, హైదరాబాద్‌కు రాలేదంటూ ఈ టీజర్ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ సంస్థానంలో రజాకర్లు హిందువులను ఇస్లాంలోకి మార్పించి, ముస్లిం రాజ్యంగా చేయాలనే ఉద్దేశ్యంతో చేసిన దారుణాలను, అరాచకాలను తెరకెక్కించినట్టుగా చూపించారు.
ఈ టీజర్ చూసిన మత పెద్దలు, నెటిజన్లు, రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ టీజర్ మొత్తంలో రజాకార్ల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేస్తూ, వారిని చెడ్డగా చూపించేందుకు ప్రయత్నం చేశారని అంటున్నారు.చరిత్రను వక్రీకరించి కొందరు ఈ మూవీని తీశార‌ని ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వార్థ రాజకీయా ప్రయోజనాల కోసం, తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
సీపీఎం పార్టీ లీడర్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ లీడర్ల సారథ్యంలో రిలీజ్ కాబోతున్న ఈ  సినిమాని బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలు మరియు భూస్వాముల మధ్య జరిగిన సాయుధ పోరాటానికి, కొందరు కులం, మతం రంగును అద్దుతున్నారని, ఎలక్షన్స్ సమయంలో ఇలాంటి చిత్రాలు రిలీజ్ అయితే ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య  విభేదాలు ఏర్పడతాయని, అందుకే ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.

Also Read: జనసేన పార్టీకి “కేతంరెడ్డి వినోద్ రెడ్డి” ఎందుకు రాజీనామా చేశారు..? లెటర్ లో ఏం ఉందంటే..?

 

 


End of Article

You may also like