కస్టమర్లకు మరో భారీ షాక్‌ ఇచ్చేందుకు జియో సిద్ధమైంది.

కస్టమర్లకు మరో భారీ షాక్‌ ఇచ్చేందుకు జియో సిద్ధమైంది.

by Megha Varna

Ads

జియోతో సంచలనాలకు తెర తీసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించింది,2016లో ప్రారంభించిన రిలయన్స్ జియో.. ఉచిత సేవలను 2019 వరకు కొనసాగిస్తూ వచ్చింది.గతేడాది చివర్లో ఉచితా ఆఫర్ ని ఎత్తివేసి షాకిచ్చింది.ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్‌పై గత ఏడాది చివరిలో నిమిషానికి ఆరు పైసలు చొప్పున విధించింది. ఇక డేటా ఫ్యాక్స్‌తో పాటుగా.. వాయిస్ కాల్స్‌కు కూడా సెపరేట్ టారిఫ్‌లను ప్రకటించి.. కస్టమర్ల నడ్డీ విరిచింది. తాజాగా కస్టమర్లకు మరో భారీ షాక్‌ ఇచ్చేందుకు జియో సిద్ధమైంది.

Video Advertisement

జియో డేటా ఛార్జీలు పెంచడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం రూ. 15గా ఉన్న 1 జీబీ డేటా ధరను రూ. 20కి పెంచాలనిటెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్‌కు జియో లేఖ రాసింది. అయితే వెంటనే చార్జీలు పెంచకుండా 6 నెలల నుంచి 9 నెలల వ్యవధిలో అమలు చేయాలని భావిస్తున్నట్టు ట్రాయ్‌కు తెలిపింది.వాయిస్‌ కాల్స్‌ ధరలను మాత్రం యథాతథంగా కొనసాగించనున్నట్లు అందులో జియో పేర్కొంది.కాబట్టి పెరిగిన చార్జీలను రెండుమూడు విడతల్లో అమలు చేసే వెసులుబాటు కల్పించాలని ట్రాయ్‌ను కోరింది. ఒకసారి డేటా చార్జీలను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత అన్ని టారిఫ్‌లలోనూ, అన్ని సెగ్మెంట్లలోనూ అమలు చేస్తామని జియో తెలిపింది.జియో ఆరు పైసలు చార్జీలు అప్పుడు అయితే స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి జియో తన వినియోగదారులను పోగొట్టుకుంది.ఇప్పుడు మళ్లీ చార్జీలు పెంచితే జియో తన వినియోగదారులను పోగొట్టుకొని మార్కెట్ లో తనకున్న స్థానాన్ని కోల్పోవచ్చు.

జియో డౌన్లోడ్ విషయంలో దూసుకొనిపోతుంది,జనవరిలో 4జీ డౌన్‌లోడ్‌ వేగంలో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో నిలిచింది. సెకనుకు 20.9 మెగాబైట్ల (ఎంబీపీఎస్‌) వేగంతో జియోలో డేటా డౌన్‌లోడ్‌ అవుతుండగా..4జీ అప్‌లోడ్‌ వేగంలో వొడాఫోన్‌ అగ్రస్థానం దక్కించుకుంది.

జియో అదనంగా  ప్రయోజనాలు ఇస్తున్నట్టు ప్రకటించింది జియో. దీని ప్రకారం అన్ని రీచార్జ్ ల పై జియో టీవీ, జియో సినిమా, జియో సావ్న్, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, జియో హెల్త్ హబ్ వంటి జియో యాప్స్ కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. జియో టీవీ ద్వారా 600కు పైగా చానెళ్లు, 100కు పైగా హెచ్ డీ చానెళ్లు ఉచితంగా చూడవచ్చు. జియో సినిమా యాప్ లో 10 వేలకు పైగా సినిమాలు, లక్షల కొద్దీ టీవీ షోలు, ఇక జియో సావన్ యాప్ లో 5 కోట్లకు పైగా పాటలను ఉచితంగా వినవచ్చు. జియో న్యూస్ యాప్ ద్వారా 150కు పైగా లైవ్ న్యూస్ చానెల్స్ ఉచితంగా చూడవచ్చు.


End of Article

You may also like