Home Filmy Adda ఏంటి మెగా హీరోలు నటించిన ఈ 4 సూపర్ హిట్ సినిమాలు… తమిళ్ విజయ్ సినిమాలకి రీమేక్ లా.?

ఏంటి మెగా హీరోలు నటించిన ఈ 4 సూపర్ హిట్ సినిమాలు… తమిళ్ విజయ్ సినిమాలకి రీమేక్ లా.?

by Sainath Gopi

దళపతి విజయ్ తమిళ స్టార్ హీరో. ఇతని గురించి తెలుగులో కూడా పరిచయం అక్కర్లేని యాక్టర్. ఈయన నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ చేయబడి ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు విజయ్. చాలా సినిమాలు తెలుగులో రీమేక్ కూడా చేశారు. మెగా హీరోలు కూడా రీమేక్ చేయడం విశేషం.

మెగా హీరోలు తెలుగులోకి రీమేక్ చేసిన విజయ్ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1997లో విజయ్ హీరోగా తమిళంలో రూపొందించిన సినిమా లవ్ టుడే. ఈ సినిమా అప్పట్లో తమిళంలో పెద్ద కమర్షియల్ హిట్.

remake movies of vijay by mega heroes

విజయ్ కి లవర్ బాయ్ ఇమేజ్ తీసుకువచ్చిన ఈ సినిమా కోలీవుడ్ థియేటర్లలో 175 రోజులకు పైగా సక్సెస్ఫుల్ గా రన్ అయింది. ఇదే సినిమాని సుస్వాగతం పేరుతో పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేశారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.ఈ సినిమా టాలీవుడ్ లో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ ని ఫాన్స్ కి దేవుడు లాగా మార్చేసిన సినిమా ఖుషి.

remake movies of vijay by mega heroes

ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పింది అనటంలో ఎలాంటి సందేహము లేదు. సిద్దు, సిద్దార్థ రాయ్ గా డిఫరెంట్ మేనరిజంతో ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు పవన్ కళ్యాణ్. నిజానికి ఈ సినిమా దళపతి విజయ్ హీరో గా నటించిన తమిళ సినిమా ఖుషి. తమిళంలో ఖుషి సినిమా కన్నా తెలుగులో ఖుషి ఎక్కువ వసూళ్లను రాబట్టింది.ఇక ఆ తర్వాత విజయ్ తిరుపాచ్చి అనే తమిళం సినిమా ని పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేసాడు. అయితే ఈసారి సీన్ రివర్స్ అయ్యింది.

remake movies of vijay by mega heroes

తిరుపాచ్చి తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ కి పెద్ద డిజాస్టర్ ని మిగిల్చింది. ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాలు ఏవీ పవన్ కళ్యాణ్ రీమేక్ చేయకపోవడం విశేషం. ఆ తర్వాత విజయ్ సూపర్ హిట్ మూవీ కత్తి సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు. ఒరిజినల్ సినిమా కన్నా ఒక యాభై కోట్లు ఎక్కువగానే ఇక్కడ కలెక్షన్లు సాధించింది ఖైదీ నెంబర్ 150.

You may also like