“లైగర్” సినిమా కోసం… వీరి “రెమ్యూనరేషన్” ఎంతో తెలుసా..? అందరికంటే ఎక్కువ ఎవరికంటే..?

“లైగర్” సినిమా కోసం… వీరి “రెమ్యూనరేషన్” ఎంతో తెలుసా..? అందరికంటే ఎక్కువ ఎవరికంటే..?

by Mohana Priya

Ads

ఈ మధ్య కాలంలో ఒక్క పెద్ద హిట్ తగిలితే చాలు హీరో అయినా హీరోయిన్ అయినా డిమాండ్, ఫ్యాన్స్ బేస్ భారీగా పెరిగిపోతుంది. అంతే కాదు దాంతో పాటు వారు రెమ్యునరేషన్ కూడా పెరిగిపోతుంది. ఈ మధ్య వారు తీసుకునే రెమ్యునరేషన్ బట్టే పెద్ద హీరోనా చిన్న హీరోనా? అనే టాక్స్ కూడా నడుస్తుంటాయి.

Video Advertisement

అయితే లైగర్ ఆగస్ట్ 25న విడుదల కానుంది. ఈ నేథ్యంలో సందడి చేస్తున్న లైగర్ మూవీ ప్రమోషన్స్ భారీగా సాగుతున్నాయి. లైగర్ సినిమా కోసం భారతదేశం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. అలాగే కొన్ని పాటలు కూడా విడుదల అయ్యాయి. ఇక ఇందులో పలువురు కీలక పాత్రలు పోషించగా, పారితోషికం కూడా భారీగానే పుచ్చుకుంటున్నారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ కూడా భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారట. మరోవైపు కీలక పాత్ర పోషించిన ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ విజయ్ కంటే ఎక్కువగా తీసుకున్నారట.

minus points in vijay devarakonda liger trailer

#1 విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఈ సినిమాకి 35 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

minus points in vijay devarakonda liger trailer

#2 మైక్ టైసన్

మైక్ టైసన్ ఈ సినిమాలో అందరి కంటే ఎక్కువ పారితోషకం తీసుకున్నారు. ఈ సినిమా కోసం మైక్ టైసన్ 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

minus points in vijay devarakonda liger trailer

#3 అనన్య పాండే

ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే 3 కోట్ల పారితోషకం తీసుకున్నారు.

minus points in vijay devarakonda liger trailer

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ మూవీ ఆగస్ట్ 25 న ప్యాన్ ఇండియా స్థాయిలో 5 భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకుంటుందో లేదో? నిజంగానే ఈ సినిమాలో అంత గొప్ప విషయం ఏంటి అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.


End of Article

You may also like