రెండు రాళ్లు దొరికాయి…రాత్రికిరాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..! అసలేమైందో తెలుస్తే ఆశ్చర్యపోతారు!

రెండు రాళ్లు దొరికాయి…రాత్రికిరాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..! అసలేమైందో తెలుస్తే ఆశ్చర్యపోతారు!

by Mohana Priya

Ads

ఒక్కరోజులో జీవితం మారిపోవడం, ధనవంతులు అయిపోవడం అనేవి మీరు సినిమాల్లో చూసే ఉంటారు. కానీ నిజంగా ఒక వ్యక్తి కి అలానే జరిగింది. టాంజానియా కి చెందిన సానినీ లేజర్‌ కి ఆ దేశంలోనే అత్యంత విలువైన గని దొరకడంతో రాత్రికి రాత్రే అతని జీవితం మారిపోయింది.

Video Advertisement

సానినీ లేజర్‌ టాంజానియా లో గనులు తవ్వుతూ ఉంటాడు. ఒకరోజు అలానే తవ్వుతున్నప్పుడు రెండు విగ్రహాలు బయటపడ్డాయి. రెండు కలిపి దాదాపు 15 కిలోల దాకా ఉన్నాయి. అవి ఏంటి అని పరీక్షిస్తే టాంజానియా లోనే అతి ఖరీదైన ఖనిజం అని తెలిసింది. దాంతో సానినీ ఆ రెండు విగ్రహాన్ని తీసుకెళ్లి టాంజానియా ప్రభుత్వానికి అప్పగించాడు. అలా అప్పగించినందుకు ప్రభుత్వం సానినీ కి 34 లక్షల డాలర్లు అంటే భారత దేశ కరెన్సీ లో 25.7 కోట్ల రూపాయలు బహుమతిగా ఇచ్చింది.

ఆ ఖనిజాన్ని టాంజానైట్ ఖనిజం అంటారు. అది కేవలం ఉత్తర టాంజానియా లో మాత్రమే దొరుకుతుంది. దీన్ని భూమి మీద లభించే అరుదైన రత్నాలలో ఒకటిగా చెబుతారు. బహుశా 20 ఏళ్ల తర్వాత ఈ ఖనిజం అంతరించిపోతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టాంజానైట్ ఖనిజం వైలెట్, ఎరుపు, ఆకుపచ్చ రంగులలో ఉంటుంది. ఖనిజం ఎంత స్పష్టంగా ఉంటే దాని ధర అంత ఎక్కువగా ఉంటుంది.

యాభై రెండేళ్ల సానినీ కి నలుగురు భార్యలు, 30 మందికి పైగా సంతానం ఉన్నారు. ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అన్న దాని గురించి మాట్లాడుతూ ” ఈ ఆదాయాన్ని మాన్యారా ప్రాంతంలో సిమాంజిరో జిల్లాలో నివసించే మా సమాజ ప్రజలకోసం ఉపయోగించాలి అని ఆలోచిస్తున్నాను. మా ఇంటి దగ్గర చదివించే స్తోమత లేక తమ పిల్లలని స్కూలుకి పంపించే లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారి కోసం ఒక స్కూలు, ఒక షాపింగ్ మాల్ కట్టాలి అనుకుంటున్నాను.

నేను చదువుకోలేదు కానీ నాకు ఏదైనా పనిని చదువుకొని, దాని గురించి పూర్తిగా తెలుసుకొని, ప్రొఫెషనల్ గా చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే నా పిల్లలు వ్యాపారంలో అడుగుపెట్టాలంటే ప్రొఫెషనల్ గా అని తెలుసుకొని అడుగు పెట్టాలి అని అనుకుంటున్నా.

నా దగ్గర 2000 ఆవులు ఉన్నాయి. నాకు డబ్బులు వచ్చినా కానీ నేను నా ఆవుల సంరక్షణ ని కొనసాగిస్తూనే ఉంటాను. ఇలా సడన్ గా డబ్బులు రావడం వల్ల నేను ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం లో భద్రత చాలా ఎక్కువ.  రాత్రుళ్ళు కూడా ధైర్యంగా తిరగవచ్చు” అని చెప్పారు.

ఇదంతా తెలుసుకున్న టాంజానియా దేశ అధ్యక్షుడు జాన్ మగుఫులి సానినీకి ఫోన్ చేసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ “మైనర్ ల తో కలిగే ప్రయోజనమే ఇది. ఇలా ఖనిజాలు దొరికిన చాలామంది వాటిని తమ స్వార్థం కోసం ఉపయోగించడం, లేదా అమ్మేయడం లాంటివి చేస్తుంటారు. కానీ ఇతను తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పగించాడు. దీంతో అతను ఎంతో నిజాయితీపరుడో తెలుస్తోంది, అదే కాకుండా టాంజానియా సంపన్నమైన దేశం అని మరో సారి రుజువైంది” అని అన్నారు.


End of Article

You may also like