Home Filmy Adda పవన్ కళ్యాణ్ సినిమా నాకు నచ్చలేదు: రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ సినిమా నాకు నచ్చలేదు: రేణు దేశాయ్

by Sainath Gopi

Ads

 

రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ కలిసి బద్రి సినిమాలో జోడిగా నటించారు. ఆ సినిమా ప్రేక్షకులను బాగా అలరించింది. ఆ సినిమా తోటే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పాటు అది ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరు కలిసి రెండోసారి జానీ సినిమాలో నటించారు.

Video Advertisement

ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పొందిన పాటల పరంగా సూపర్ హిట్ అయింది. అది పవన్ కళ్యాణ్ సొంత డైరెక్షన్ లో రావడం విశేషం.ప్రస్తుతం పవన్ కళ్యాణ్  సినిమాలతోనూ అటు రాజకీయాలతోను బిజీ బిజీగా గడుపుతున్నారు.

pawan kalyan renu desai daughter

రేణు దేశాయ్ 18 సంవత్సరాల తర్వాత మళ్లీ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమా తనకి నచ్చలేదని తెలియజేశారు.
అసలు విషయంలోకి వెళ్తే బాలు సినిమా 2005లో రిలీజ్ అయింది. ప్రముఖ దర్శకుడు కరుణాకరణ్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రీయ శరణ్, నేహా ఒబెరాయ్ నటించారు.

అయితే ఈ హీరోయిన్స్ లో నేహా రేణు దేశాయ్ కి నచ్చలేదట.ఆ విషయంపై స్పందిస్తూ… కరుణాకర్ నాతో చాలా క్లోజ్ గా ఉంటాడు. అక్క అక్క అంటుంటాడు. ఆ క్లోజ్ నెస్ తో ఆ మూవీ సమయంలో హీరోయిన్ విషయం గురించి మాట్లాడుతూ… అక్క ఆ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ లా ఉంటుందని చెప్పాడు. అయితే ఫోటో చూపించిన తర్వాత నాకు అంత అనిపించలేదు. హీరోయిన్ బాగానే ఉంది కానీ ఐశ్వర్య అంత లేదని చెప్పాను అని పేర్కొంది.

అయితే తాను తన అభిప్రాయం మాత్రమే చెప్పింది తప్ప ఆ హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడడం కానీ ,లేదా సినిమాలోకి తీసుకోవద్దని కానీ చెప్పలేదట. కాకపోతే ఈ విషయం బయటకు వేరేలా వచ్చిందంట హీరోయిన్ విషయంలో రేణు దేశాయ్ అసంతృప్తి వ్యక్తం చేసిందని ఆమెకు ఆ హీరోయిన్ అంటే ఇష్టం లేదని వార్తలు వచ్చాయని పేర్కొంది.

కాగా బాలు సినిమాకి రేణు దేశాయ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. అంతేకాదు మూవీలోని హాట్ హాట్ జా సాంగ్ కి ఎడిటర్ గా కూడా పనిచేశారు. మూవీలో ఈ రెండు విషయాలకి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి.

Also Read:వచ్చే జన్మలో కూడా కలిసి పని చేయలేని అంత పెద్ద నమ్మకద్రోహం ఏం చేశాడు..? అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి..?


End of Article

You may also like