బద్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి రేణూ దేశాయ్. రేణూ దేశాయ్ కేవలం నటి మాత్రమే కాదు. కాస్ట్యూమ్ డిజైనర్, అలాగే ఇప్పుడు దర్శకురాలు కూడా. అంతకు ముందు రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు రేణూ దేశాయ్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రేణూ దేశాయ్ ఇటీవల ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ ఒక వీడియో. ఇందులో రేణూ దేశాయ్ సముద్రం నీళ్లలో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ పోస్ట్ కింద రేణూ దేశాయ్ “సముద్రాలపై నాకున్న ప్రేమ” అని రాశారు. అంతే కాకుండా ఈ వీడియోకి ఎంతవాడుగాని సినిమాలో చిన్మయి పాడిన మనసున ఏదో రాగం పాట కూడా బ్యాక్ గ్రౌండ్ లో ఆడ్ చేశారు రేణూ దేశాయ్. చిన్మయి గొంతు బాగుంది అని కూడా మెచ్చుకున్నారు. ఇందుకు చిన్మయి కూడా థాంక్యూ అని అర్థం వచ్చేలాగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :