Ads
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత నుండి రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఉన్న పనులు అన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆడవారికి ఫ్రీ బస్సు వసతి కల్పించారు. అంతేకాకుండా రజినీకి జాబ్ కూడా ఇప్పించారు.
Video Advertisement
అయితే రేవంత్ రెడ్డి కొంతకాలం క్రితం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో తన రాజకీయ ప్రస్థానం గురించి మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఇందులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఎటువంటి వ్యాపకాలు లేవు అని, కేవలం ప్రజల మధ్యలోనే ఉంటాను అని, తాగుడు లాంటి అలవాట్లు కూడా లేవు అని అన్నారు. అందుకు ఆర్కే గారు, “తెలంగాణ సంస్కృతిలో మందు ఏమీ తప్పు కాదు. అది ఎందుకు అలవాటు కాలేదు?” అని అడిగారు. అందుకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్తూ, “నాకు చిన్నప్పటినుండి కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉన్నాయి.”
“ఎందుకంటే మా గ్రామం ఆ గ్రామంలో పెరిగిన పరిస్థితులు, మా నాన్న, మా చిన్నాన్నలు ఇలాంటి పరిస్థితుల వల్ల ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్నిసార్లు జైలుకి వెళ్లారు, ఆ గ్రామ కక్షలు, ఇవన్నీ కూడా మానసికంగా కొన్ని అంశాలు కొంత ప్రభావం చూపాయి. నాకు యుక్త వయసులో అలవాటు అవ్వలేదు. ఎందుకంటే కాలేజ్, హాస్టల్ లేదా బయట తిరిగేటప్పుడు ప్యాషన్ వల్ల ఇలాంటివి చిన్న వయసులో అలవాటు అవుతాయి.”
“సరదాతో మొదలయ్యి ఆ తర్వాత వ్యసనంగా మారుతుంది. నాకు ఆ వయసులో కాలేదు. ఇంక అవసరం రాలేదు. ఇప్పుడు మనం పదిమందికి ఆదర్శంగా ఉండాలి అనుకున్నప్పుడు, కొన్ని విషయాలను, బలహీనతలని మనం దూరం పెట్టుకోవాలి. నాయకుడు అనేవాడు ఎవరైనా చీకటి కోణం చూద్దాం అనుకున్నా కూడా అవకాశం ఇవ్వన్నట్టుగా ఉండాలి. ఫోన్ లో మాట్లాడేవాళ్ళు 90 శాతం వాళ్ళు గాలి ముచ్చట్లు మాత్రమే మాట్లాడుతారు. రాత్రిపూట మనం పడుకున్నప్పుడు ఫోన్ చేస్తారు. మనం వాళ్ళకి ఏమైనా అయ్యిందేమో అని ఫోన్ ఎత్తితే, “ఏం చేస్తున్నావు?” అంటారు.”
“ఏంటి ఏమైనా ఉందా అని అడిగితే, “ఏం లేదు. మేమంతా దోస్తులతో కూర్చొని దావత్ చేసుకుంటున్నాను. ఇది మా కల్చర్ ఇదిగో ఇతను మా వాడే. ఇతనితో మాట్లాడు” అంటూ ఫోన్ ఇస్తారు. మనం తిరిగి తిరిగి వచ్చి అలా పడుకొని ఉంటే వాళ్ళు అలా మాట్లాడితే ఏమనాలో కూడా తెలియదు. దీనివల్ల నిద్ర పట్టదు.”
“పొద్దునంతా పడుకునే సమయం వాడికి ఉంటుంది. కానీ ఏడింటికి నా ఇంటి దగ్గరికి విజిటర్స్ వస్తారు. నేను ఎంత ఆలస్యంగా పడుకున్నా కూడా పొద్దున 8:00 కి నేను విజిటర్స్ ని కలిసి, అక్కడ ఏమేం పనులు చేయాలో అన్ని పదకొండింటికల్లా ముగించుకొని, నేను భోజనం చేసి తర్వాత నా పని చేసుకుంటాను.” అంటూ రేవంత్ రెడ్డి తనకి తాగుడు ఎందుకు అలవాటు లేదు అనేది చెప్పుకొచ్చారు.
watch video :
ALSO READ : ఎవరీ “మోహన్ యాదవ్”…మధ్యప్రదేశ్ కి సీఎం అవ్వకముందు ఏం చేసేవారు.?
End of Article