వంట మనిషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్..! ఎందుకంటే..?

వంట మనిషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్..! ఎందుకంటే..?

by kavitha

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ ను చూపుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కీలకమైన పోస్ట్ లకు కొత్త అధికారులను తీసుకుని, పాత ఆఫీసర్లను బదిలీ చేశారు.

Video Advertisement

తెలంగాణ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా తన కారునే వాడుతున్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో వంట మనిషికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు  ఇప్పుడు చూద్దాం..
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా తెలంగాణ భవన్ నుండి సీఎం రేవంత్ రెడ్డికి భోజనం వచ్చిందట. ఆ విషయాన్ని ఆయన ఇంట్లో పనిచేసే వంట మనిషి రేవంత్ రెడ్డికి చెప్పారట. ఆ విషయం విన్న ఆయన ఇలా అయితే పనిలో నుంచి నిన్ను తీసేయాల్సి వస్తుందని తన వంట మనిషికి వార్నింగ్ ఇచ్చారట. ప్రోటోకాల్ వంటివి వద్దని, తాను ఇంటి భోజనమే తింటానని, ఎప్పటిలాగే చేయమని తన వంట మనిషికి చెప్పారంట.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి భవన్‌ ను ప్రజా భవన్‌గా మార్చిన  విషయం తెలిసిందే. ప్రజావాణి కార్యక్రమంను అక్కడి నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో ఇంతకు ముందు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఉండేది. ప్రస్తుతం దాన్ని డిప్యూటీ సీఎం అయిన భట్టి విక్రమార్కకు కేటాయించారు. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్‌ జూబ్లీహిల్స్‌లో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ క్యాంప్ ఆఫీస్‌ కోసం ఎక్కువ ఖర్చు పెట్టకుండా, షెడ్డ్ వంటిది నిర్మించి ఉపయోగించుకుంటారని తెలుస్తోంది. సొంతకారునే ఉపయోగిస్తున్న సీఎం, తన కారుకే బుల్లెట్ ప్రూఫ్ స్టిక్కరింగ్ చేయమని చెప్పారు. అంతేకాకుండా సీఎం కాన్వాయ్‌లో ఉన్న కార్ల సంఖ్యను కూడా తగ్గించాలని నిర్ణయించారు. అనవసర ఖర్చులు చేయకుండా ప్రజలను ఆకట్టుకునేలా పాలన కొనసాగిస్తున్నారు.

Also Read: ఇందిరమ్మ ఇంట్లో ఉండే పేపర్ బాయ్…ఇప్పుడు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే.! ఎవరంటే.?


You may also like

Leave a Comment