రేవంత్ రెడ్డి ఈ విషయం 7 సంవత్సరాల క్రితమే చెప్పారా..? ఈ వీడియో చూశారా..?

రేవంత్ రెడ్డి ఈ విషయం 7 సంవత్సరాల క్రితమే చెప్పారా..? ఈ వీడియో చూశారా..?

by Mohana Priya

Ads

కొత్త నిర్ణయాలతో, కొత్త పథకాలతో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటీవల తెలంగాణ స్టేట్ టీఎస్ ని, టీజీగా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ అధికారిక చిహ్నంలో కూడా మార్పులు చేస్తున్నారు. ఇందులో చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉంటాయి. ఆ గుర్తులని ఇప్పుడు తొలగించబోతున్నారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అయితే, రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి ఏడు సంవత్సరాల క్రితమే చెప్పారు అంటూ ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ఏ అవకాశం వచ్చినా అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా. అక్కడ పునాది వేస్తా” అని రేవంత్ రెడ్డి తెలిపారు.

Video Advertisement

revanth reddy old video about telangana symbol

అప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ వీడియో ఏడు సంవత్సరాల క్రితం వీడియో. “రేవంత్ రెడ్డి అప్పుడు చెప్పినట్టే ఇప్పుడు చేస్తున్నారు” అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో 2017 లో మే 31వ తేదీన జరిగిన ప్రెస్ మీట్ లోది. అందులోనే రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి మాట్లాడారు. తెలంగాణ చిహ్నాన్ని మార్చే బాధ్యతని రేవంత్ రెడ్డి ప్రముఖ కళాకారుడు రుద్ర రాజేశానికి అందించారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా కొత్తగా కంపోజ్ చేయిస్తున్నారు.

ఆస్కార్ పొందిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ పాటని కంపోజ్ చేశారు. రాష్ట్ర అధికారిక గీత స్వర కల్పన ఇప్పటికే జరిగింది. ఈ విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. “తెలంగాణ వాసి కాని కీరవాణితో పాట స్వర కల్పన చేయించడం ఏంటి?” అంటూ కామెంట్స్ చేశారు. చాలా మంది, “ఆస్కార్ పొంది భారతదేశానికే గర్వకారణం అయ్యారు. దేశానికి గౌరవం తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తితో పాట స్వర కల్పన చేయించడం అనేది చాలా గొప్ప విషయం” అంటూ కీరవాణికి మద్దతుగా కామెంట్స్ చేశారు. ఈ పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నారు.


End of Article

You may also like