BHIMAVARAM: రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక భీమవరం వాళ్ళు ఎందుకు సంబరాలు జరుపుకున్నారో తెలుసా…?

BHIMAVARAM: రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక భీమవరం వాళ్ళు ఎందుకు సంబరాలు జరుపుకున్నారో తెలుసా…?

by Mounika Singaluri

Ads

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ అభిమానులు,రేవంత్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయితే భీమవరం లో సంబరాలు చేసుకోవడం ఏంటి అనుకుటున్నారా….! అసలు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి వియ్యంకుడిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కావడమే…

Video Advertisement

రేవంత్ రెడ్డి ఏకైక కుమార్తె నైమిష రెడ్డిని భీమవరం కి చెందిన సత్యనారాయణ రెడ్డితో 2015లో వివాహం చేశారు.పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రేవంత్ రెడ్డి వియ్యంకుడు గొలుగూరి వెంకట్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త.భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటారు.

రేవంత్ రెడ్డికి భీమవరానికి చెందిన ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి.సంక్రాంతి సమయంలో రేవంత్ పలుమార్లు భీమవరం విచ్చేసేవారు. రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావాలని భీమవరంలో పలు ఆలయాల్లో పూజలు కూడా జరిపించారు.సీఎం గా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించగానే భీమవరంలో సంబరాలు మొదలయ్యాయి.రేవంత్ కుమార్తె నైమిష,అల్లుడు సత్యనారాయణ రెడ్డి వారి నివాసం వద్ద టపాసులు కాల్చి స్వీట్ లు పంచి కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తు భీమవరంలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.

 


End of Article

You may also like