నిన్న చెక్ ఇచ్చాడు…ఇప్పుడు మరో విషయం బయటపెట్టాడు! రేణుక చేయబోయే పనికి గ్రేట్ అనాల్సిందే!

నిన్న చెక్ ఇచ్చాడు…ఇప్పుడు మరో విషయం బయటపెట్టాడు! రేణుక చేయబోయే పనికి గ్రేట్ అనాల్సిందే!

by Megha Varna

దిశ ఘటన దేశవ్యాప్తంగా ఎంతమందిని కదిలించిందో అందరికి తెలిసిందే. ఆ ఘటనపై సినిమా తీస్తానని ప్రకటించాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.అందులో పోలీసులని హీరో గా చూపించబోతున్నాడు అంట. ఇప్పటికే సంఘటన జరిగిన స్థలానికి వెళ్లి ఆ ఘటన ఎలా జరిగి ఉంటుంది అనే కోణంలో తన బుర్రకి వర్మ పని పెట్టాడు.దానికి సంబంధించి పోస్టులు కూడా పెట్టాడు వర్మ.

Video Advertisement

నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశాడు వర్మ. రేణుక, చెన్నకేశవులును 16ఏళ్లకే పెళ్లి చేసుకుందని.. ఇప్పుడు ఆమె 17ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. చెన్నకేశవులు దిశతోపాటు.. రేణుకను కూడా భాదితులురాలిగా మార్చడంటూ తెలిపాడు. అతను చేసిన పనికి రేణుకతోపాటు, అతని బిడ్డకు కూడా భవిష్యత్ లేకుండా పోయిందన్నారు.

అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ ఆమెను ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూ లో రేణుక ఓ విషయం చెప్పింది. తనకి పుట్టబోయే పిల్లలు ఆడ అయినా మగ అయినా “దిశా” అనే పేరు పెడతాను అని చెప్పింది. ఇదే విషయాన్నీ రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసారు. ఎంతైనా రేణుక తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసించకుండా ఉండలేము. మొత్తానికి ఇప్పటివరకు మనం రామ్ గోపాల్ వర్మలో చూడని మరోకోణంని చూస్తున్నాము. ఇక సినిమా ఎలా తీస్తాడో వేచి చూడాలి.

watch video:


You may also like

Leave a Comment