Ads
శివ లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలను ఇచ్చిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రకమైన అభిప్రాయం ఉన్న వాళ్ళందరినీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూపు తిప్పుకునేలా చేశారు.
Video Advertisement
రామ్ గోపాల్ వర్మ సినిమాలో హీరోల పాత్రల రూపొందించే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది. అప్పట్లో చాలా మంది హీరోలు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించాలి అని అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆర్జీవి ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంటారు.
ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అయిన యాంకర్లు చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది బిగ్ బాస్ వంటి ప్రోగ్రామ్ లకి వెళ్లి సెలబ్రిటీలుగా మారిపోయారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసిన మరొక యాంకర్ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆమె పేరు శ్వేతా వర్మ. శ్వేతా వర్మ కొంత కాలం క్రితం రామ్ గోపాల్ వర్మతో ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో చాలా ఫేమస్ అయ్యారు. తర్వాత కొద్ది రోజులు కనిపించలేదు. ఇప్పుడు శ్వేతా వర్మ ఎంపీగా పోటీ చేస్తున్నారు.
వైసీపీ పార్టీ తరఫున శ్వేతా వర్మ పోటీ చేస్తున్నారు. వైసీపీ పార్టీ నుండి నర్సాపురం నియోజకవర్గానికి ఎంపీగా శ్వేతా వర్మని పోటీ చేయించాలి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అనే వార్త వినిపిస్తోంది. శ్వేతా వర్మ రఘురామ కృష్ణంరాజుకి పోటీగా నిలబడబోతున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని అనుకున్న విషయం తెలిసిందే. వారిలో శ్వేతా వర్మ పేరు కూడా ఉంది. అయితే నర్సాపురం నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి, రఘురామ కృష్ణంరాజుకి పోటీగా అదే వర్గానికి చెందిన శ్వేతా వర్మని పోటీ చేయించాలి అని అనుకుంటున్నారు అని సమాచారం.
watch interview:
కాంగ్రెస్ నుండి కనుమూరి బాపిరాజు కూడా నరసాపురం లోక్ సభ బరిలో దిగుతున్నారు. కనుమూరి బాపిరాజుకి రఘురామ కృష్ణంరాజు స్వయాన అన్న కొడుకు. బాబాయి అబ్బాయి మధ్య పోరు జరుగుతున్న క్రమంలో ఒక యువనేతను దింపాలి అని వైసీపీ అనుకుంటున్నట్టు సమాచారం. అక్కడ క్షత్రియ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదే వర్గానికి చెందిన నేతని బరిలోకి దింపాలి అనుకుంటున్నారు.
watch video :
ALSO READ : రెండు గంటల పాటు సాగిన సునీత-షర్మిల భేటీ…. ఏం మాట్లాడుకున్నారు.?
End of Article