Ads
ఎప్పుడూ వివాదాలకు తెరలేపే సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.సినిమాతోనే కాదు ఒక చిన్న ట్వీట్ ద్వారా కూడా సంచలనాలు సృష్టించగల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.అయితే లాక్ డౌన్ నేపథ్యంలో మియా మాల్కోవా తో “క్లైమాక్స్ ” అనే చిత్రాన్ని నిర్మించి ఆన్ లైన్ వేదికగా విడుదల చేసారు..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
Video Advertisement
అయితే క్లైమాక్స్ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ ఆసక్తి రేపడంతో ఆన్ లైన్ లో ఈ చిత్రం విడుదల అయిన మొదటి గంటలోనే ఈ చిత్రాన్ని చూసేందుకు లక్షల సంఖ్యలో ప్రేక్షకులు పోటీపడ్డారు.దీంతో ఒక్కసారిగా ఆ వెబ్ సైట్ క్రాష్ కు గురయ్యింది.ఈ చిత్రాన్ని విడుదల అయిన మొదటిరోజే 3 లక్షల కంటే ఎక్కువమంది చూసినట్టు తెలుస్తుంది. కాగా క్లైమాక్స్ చిత్రాన్ని ఆన్ లైన్ వేదికగా ఒక్క వ్యూ కి 100 రూపాయలు చెల్లించే విధంగా విడుదల చేసారు.
అంటే దాదాపు మొదటిరోజే 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వసూలు చేసినట్లు తెలుస్తుంది.కొన్ని వందల థియేటర్స్ లో విడుదల చేసిన కూడా మొదటి రోజు ఇంత కలెక్షన్ రావడం కష్టం అలాంటింది మొదటిసారి ఆన్ లైన్ స్ట్రీమింగ్ లో ఇంత మొత్తంలో డబ్బులు రావడం నిజంగా గొప్ప విషయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ప్రతీసారి రామ్ గోపాల్ వర్మ విడుదల చేసే ట్రైలర్ లు ,ఫస్ట్ లుక్ లు మంచి క్రేజ్ సంపాదించుకుంటాయి కానీ చిత్రం విడుదల అయ్యాక మాత్రం నిరాశపరుస్తుంటాయి.ఈ విషయం గత కొద్ది సంవత్సరాల నుండి రామ్ గోపాల్ వర్మ నుండి వచ్చిన చిత్రాలు చుస్తే అర్ధం అవుతుంది.అయితే ఇప్పుడు మియా మాల్కోవా తో తీసిన క్లైమాక్స్ చిత్రం కూడా ప్రేక్షకులను నిరాశపరించింది అని తెలుస్తుంది.మియా మాల్కోవా అందచందాలను డిఫరెంట్ యాంగిల్స్ లో చూపించడం తప్పితే వర్మ ఏమి చెయ్యలేదు అని కొన్ని అభిప్రాయాలూ వినపడుతున్నాయి.
End of Article