రాంగోపాల్ వర్మ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఈ మనిషి ఒక వింత మనిషి. ఈయన సినిమాలు వింతగా వివాదాలకు చెంతగా ఉంటాయి. ట్విట్టర్లో ఈయన చేసే పోస్టులు మంట రాజేసే విధంగా ఉంటాయి. సినిమా వాళ్ళని, రాజకీయ నాయకులని ఇలా ఏ ఒక్కరిని వదలకుండా తనకు ఇష్టం వచ్చిన ట్వీట్లు వేస్తూ ఆడుకుంటూ ఉంటాడు. వివాదం ఎక్కడుంటే రాంగోపాల్ వర్మ అక్కడ ఉంటాడు అనే విధంగా ఈయన చర్యలు ఉంటాయి.

Video Advertisement

ఇక మరి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం అంటే రాంగోపాల్ వర్మ భలే ఎంజాయ్ చేస్తాడు. అందులోనూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల పైన ఈయన చేసే కామెంట్లు పోస్ట్లు దారుణంగా ఉంటాయి. ఇన్ డైరెక్ట్ గా వైసీపీకి సపోర్ట్ చేస్తూనే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా సినిమాలు తీస్తూ ఉంటాడు

RGV comments on garikapati old video..

తాజాగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటినుండి సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో కౌంటర్లు వేస్తూనే ఉంటున్నాడు.ఇప్పుడు ఈయన సోషల్ మీడియాలో ఒక సెల్ఫీ ని పోస్ట్ చేశాడు. అది కాస్త వైరలై కూర్చుంది. చంద్రబాబు ఉంచిన రాజమండ్రి సెంట్రల్ జైలుకు ముందుకు వెళ్లి సెల్ఫీ తీసి రాంగోపాల్ వర్మ దానిని పోస్ట్ చేశాడు. తనదైన శైలిలో క్యాప్షన్ ఇస్తూ జైలు బయట నేను జైలు లోపల ఆయన అంటూ చంద్రబాబును ఉద్దేశించిపోస్ట్ చేశాడు.

ఈ ఫోటో ఇప్పుడు ట్విట్టర్లో దుమారాన్ని రేపుతుంది.  వైసిపి శ్రేణులు పాజిటివ్ గా కామెంట్లు చేస్తుంటే. టిడిపి వారైతే నువ్వు కూడా త్వరలో జైలుకెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ హెచ్చరిస్తున్నారు. ఎందుకయ్యా ఆర్జీవి నీకు ఇవన్నీ అంటూ అభిమానులు బోధిస్తున్నారు.

 

Also Read:ఆమె వయసు 54 ఏళ్ళు.. మేకప్ వేసి 30 ఏళ్ళ అమ్మాయిలా పెళ్లి చేసుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?