Ads
నేను టాలీవుడ్ లో సినిమాలు చేయను అంటూ తట్ట బుట్ట సర్దేసి బాలీవుడ్ కు మకాం మార్చేసిన వర్మ అక్కడ తనతో సినిమాలు చేయడానికి ఎవరూ దొరకకపోవడంతో తిరిగి టాలీవుడ్ వచ్చేశాడు.తన కథలో పటుత్వం తగ్గడంతో వరుస ఫ్లాపులు డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్ కు లాస్ లు వస్తుండడంతో పెట్టిన డబ్బులను రెండింతలుగా రాబట్టుకోవడం కోసం వివాదాలు సృష్టించడం లేదా తన చిత్రాలు వివాదాల్లో ఇరుక్కునేల చేసి ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెంచేసి వాళ్ళని థియేటర్లకు వచ్చేలా చేశాడు.ఎవరి కిటుకైన కొద్దికాలమే పని చేస్తుంది.
Video Advertisement
అందుకే జనాలు ఈమధ్య రాంగోపాల్ వర్మ చిత్రాలకు వెళ్ళడం పూర్తిగా తగ్గించేశారు. దీనితో ఓటిటిల పై పడ్డారు.అక్కడ ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అందుకే అందులో చేయాల్సిన రాక్షస ప్రయత్నాలన్నీ చేశారు బహుశా అవి కూడా బెడిసి కొట్టినట్టున్నాయి అందుకే ఇప్పుడు వరుసగా ఒక్కొక్క ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ చిత్రాలు చేస్తున్నారు.
ఎన్నికల ముందు నారా అండ్ నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఆర్జీవి ఇప్పుడు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు.మొన్న పవన్ ను టార్గెట్ చేసిన ఆర్జీవి ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ను టార్గెట్ చేస్తూ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట.ఈ ఆర్జీవి చిత్రాల దెబ్బ న్యూస్ చూడడానికి కూడా లేకుండా పోయింది ఎక్కడ చూసిన ఈయన.ఈయన అర్థం పర్థం లేని లాజిక్స్ అని సామాన్యులు అనుకుంటున్నారట.
End of Article