నటుడు సుమంత్ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సుమంత్ కి కొన్ని సంవత్సరాల క్రితం హీరోయిన్ కీర్తి రెడ్డి పెళ్లి అయింది అని తర్వాత వారిద్దరూ విడిపోయారు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు సుమంత్ రెండో పెళ్లి విషయం ప్రముఖ దర్శకులు రాం గోపాల్ వర్మ వరకు ఈ వార్త వెళ్ళింది.

ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా స్పందించి ఈ విధంగా అన్నారు ఒకసారి అయ్యాక కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా సుమంత్.? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ. అనుభవించండి.

ఇంకొక ట్వీట్ లో ఒక పెళ్లే నూరేళ్ల పెంట అయితే, రెండో పెళ్లి ఏంటయ్యా స్వామి.? నా మాట విని మానెయ్యి. పవిత్ర గారు మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. తప్పు మీది సుమంత్ అది కాదు. తప్పు ఆ దౌర్భాగ్యపు వ్యవస్థది. అని అన్నారు.