Ads
డైరెక్టర్లు అందరిదీ ఒక దారి అయితే ఆర్జివి ఒక్కరిది ఒక దారి. అందరు డైరెక్టర్లు జనాలకి నచ్చాలి కలెక్షన్లు బాగా రావాలి అనే ఆలోచన లో తో సినిమాలు తీస్తారు. రాంగోపాల్ వర్మ అయితే “నాకు నచ్చినట్టు నేను సినిమాలు తీస్తాను. చూస్తే చూడండి లేకపోతే లేదు. మీ ఇష్టం” అన్నట్టు సినిమాలు తీస్తారు.
Video Advertisement
గత కొద్ది కాలం నుండి రామ్ గోపాల్ వర్మ కొంతమంది ప్రముఖుల మీద సినిమాలు తీసే పనిలో ఉన్నారు. ఎన్ని వివాదాలు వచ్చినా కూడా ఆయన సినిమా మాత్రం తీసే తీరుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ మీద కూడా సినిమా తీసి “ఎందుకు తీసావ్” అని ప్రేక్షకులు అడిగితే “నా సినిమాలో హీరో పేరు ప్రవన్ కళ్యాణ్. ఇది పవన్ కళ్యాణ్ మీద సినిమా ఎలా అవుతుంది?” అని తిరిగి అందర్నీ ప్రశ్నించారు.
దాంతో కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య రామ్ గోపాల్ వర్మ మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పైన కనిపిస్తున్న ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటిది? ఆర్జీవి ఏంటి అలా హాస్పటల్లో ఉన్నాడు? అనే ఆలోచన చాలా మందికి రావచ్చు. కానీ నిజానికి ఆర్జివి మీద రాబోతున్న కొత్త సినిమా “ఎవడ్రా నన్ను కొట్టింది” మోషన్ పోస్టర్ అది.
https://www.youtube.com/watch?v=No1lPc49BRg
ఇప్పటికే ఆర్జీవి గురించి చూపిస్తూ పరాన్నజీవి అనే సినిమాని తీశాడు. షకలక శంకర్ తో డేరా బాబా పేరుతో ఆర్జీవి ని ఉద్దేశించి తీసిన సినిమా ట్రైలర్ కూడా ఇటీవల విడుదలైంది. ఇప్పుడు దర్శకుడు సన్ ఆఫ్ నీలకంఠం ఎవడ్రా నన్ను కొట్టింది పేరుతో సినిమా తీశారు. ఆర్జివి గాయాలతో హాస్పటల్లో ఉన్నట్టుగా ఉన్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ని ఇటీవల విడుదల చేశారు.
End of Article