అందాలను ఆరబోస్తూ ఆర్జీవి హీరోయిన్.. ఓ రేంజ్ లో కుర్రకారుని పిచ్చెక్కిస్తున్న ఆరాధ్య దేవి!

అందాలను ఆరబోస్తూ ఆర్జీవి హీరోయిన్.. ఓ రేంజ్ లో కుర్రకారుని పిచ్చెక్కిస్తున్న ఆరాధ్య దేవి!

by Harika

Ads

కొత్త కొత్త హీరోయిన్స్ ని వెతికి మరీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు ఆర్జీవి. కొన్ని రోజుల క్రితం వర్మ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చూసిన తెలుగుతోపాటు ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలు ఉలిక్కి పడ్డాయి. ఒక అమ్మాయికి సంబంధించిన రీల్ ఒకటి పోస్ట్ చేసి ఎవరీ అమ్మాయి తొందరగా ఫైండ్ చేయండి అంటూ కోరాడు. ఇంకేముంది ఒక్కరోజులోనే ఆ యువతీ దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది.

Video Advertisement

వెంటనే ఆ యువతీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వర్మ చేతికి వెళ్లిపోయాయి. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ఆ అమ్మడి అందానికి దాసోహం అయ్యారు. సోషల్ మీడియాలో ఆ అమ్మాయి అందాన్ని ఆస్వాదిస్తూ తెగ పోస్టులు పెడుతున్నారు. ఆమె మరెవరో కాదు నటి ఆరాధ్య దేవి. ఈమె అసలు పేరు శ్రీలక్ష్మి సతీష్. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది, ప్రతిరోజు రకరకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

అలా ఓ రోజు ఆర్జీవి కంటపడింది. అంతే ఆమె ఎవరు, ఆమె ఐడి తెలిస్తే చెప్పండి అంటూ నెటిజన్స్ ని రిక్వెస్ట్ చేశారు. మొత్తానికి అమ్మడి ఐడి పట్టుకున్నారు ఆమెను హీరోయిన్ గా ఒప్పించారు. ఆమెతో ఇప్పుడు శారీ అనే సినిమాని కూడా చేస్తున్నారు ఆర్జీవి. అయితే ఈ చిన్నదాని అందం కుర్రకారుని పిచ్చెక్కించేలా చేస్తుంది. మోడరన్ డ్రెస్ లోనే అందంగా ఉంది అనుకుంటే చీరకట్టులో మరింత అందంతో మెరిసిపోతుంది ఈ బ్యూటీ.

గతంలో చీర కట్టుతో ఒక ఫోటోషూట్ చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే తెగ వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా ఆరాధ్య దేవికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఎప్పుడూ చీరకట్టులో కనిపించే ఆరాధ్య మోడర్న్ డ్రెస్సులో మెరిసింది. అందాల ఆరబోస్తూ కొన్ని వీడియోలు షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో చాలా గ్లామరస్ గా కనిపించింది ఆరాధ్య దేవి.


End of Article

You may also like