టిక్ టాక్ లో అదరగొట్టిన యువతికి…రామ్ గోపాల్ వర్మ బంపర్ ఆఫర్…!

టిక్ టాక్ లో అదరగొట్టిన యువతికి…రామ్ గోపాల్ వర్మ బంపర్ ఆఫర్…!

by Megha Varna

Ads

భారతీయ దర్శకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . శివ సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచంలో ఉన్న అన్ని జోనర్ల సినిమాలు తీసాడు వర్మ .కాగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఎప్పుడు వార్తలో నిలుస్తాడు రామ్ గోపాల్ వర్మ ..కాగా చాలా మంది కొత్త దర్శకులని ,సాంకేతిక నిపుణుల్ని ఇండస్ట్రీ కి పరిచయం చేసారు వర్మ .. అకస్మాత్తుగా కొత్తవారికి అవకాశం ఇస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ ..ఈ నేపథ్యంలో టిక్ టాక్ యువతికి వర్మ బంపర్ ఆఫర్ ఇచ్చాడు ..వివరాలలోకి వెళ్తే ..

Video Advertisement

రోజు రోజుకి సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోవడం ,యూట్యూబ్ ,టిక్ టాక్ లాంటివి అందరికి అందుబాటులో ఉండడంతో ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ను షేర్ చేసుకునేందుకు సామజిక మాధ్యమాలను బాగా వాడుకుంటున్నారు .ముఖ్యంగా టిక్ టాక్ వచ్చిన తర్వాత చిన్న ,పెద్ద ,హౌస్ వైఫ్స్ ,వృద్దులు అనే ఏ తేడా లేకుండా అందరు ఈ యాప్ ను బాగా ఉపయోగిస్తున్నారు ..

 

కొంతమంది హాస్యాస్పదంగా పాపులర్ అవుతుంటే ,కొంతమంది నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ టిక్ టాక్ యాప్ నుండి బయటకి వస్తున్నారు .ఇప్పటికే ఈ యాప్ ద్వారా ఫేమస్ అయినవాళ్లు స్టార్ స్టేటస్ ను అందుకుంటున్నారు .

తాజాగా టిక్ టాక్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన  ఓ అమ్మాయికి వర్మ నుండి బంపర్ ఆఫర్ వచ్చింది .ఈ అమ్మాయి టిక్ టాక్ వీడియో చూసి ఆకర్షితుడు అయిన వర్మ తన వీడియో ను తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేస్తూ నీకు నటన మీద ఆసక్తి ఉన్నట్లయితే నా మెయిల్ ఐడి కి నీ డీటెయిల్స్ మెయిల్ చెయ్ అని పోస్ట్ చేసాడు .దీంతో తన మెయిల్ ఐడి ని కూడా షేర్ చేసాడు వర్మ .

ఇక ఆ అమ్మాయి విషయానికి వస్తే `ఆక్వా గర్ల్ ఏకె` @aquagirlak అనే ఐడితో ఉన్న ఎకౌంట్ లో ఆ అమ్మాయి వీడియో పోస్ట్ చేసింది .కాగా వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకూ ఈ యువతి టిక్ టాక్ చేసింది ఈ యువతి .తన డైలాగే కావడంతో వెంటనే కనెక్ట్ అయిన వర్మ తనకి ఆఫర్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు ..మరి ఈ అమ్మాయి వర్మ ఆఫర్ ను ఒప్పుకుంటుందో లేక రిజెక్ట్ చేస్తుందో వేచి చూడాలి ..


End of Article

You may also like