Ads
వివాదాలకు కేంద్ర బిందువైన రాంగోపాల్ వర్మ కరోనా టైంలో కూడా వరుసగా సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.తాజాగా ఆయన పవర్ స్టార్ అనే చిత్రాన్ని తీశారు.ఈ చిత్రంలో పవన్ టార్గెట్ చేసే అంశాలు బోలెడు ఉన్నాయి.వాటిలో కొన్నిటిని ట్రైలర్ లో చూపించారు.దానితో ఒక వైపు మీడియా ప్రశ్నలతో మరోవైపు ఫ్యాన్స్ తిట్లతో ఆయనను ఫుల్ గా వాయించడం మొదలుపెట్టారు. కాని వాటిని ఆయన అసలు పట్టించుకోలేదు.పైగా దాని ద్వారా కావల్సినంత పబ్లిసిటీ దొరుకుతుంది కదా అని లైట్ తీసుకున్నాడు.
Video Advertisement
ఆయన కోరిన విధంగా సినిమా విడుదలైంది.ఈ చిత్రాన్ని చూడడానికి టికెట్ ధర 150 రూపాయిలు పెట్టారు.దానితో అసలు అందులో ఏముందో చూద్దాం అని కొన్న వాళ్ళంతా తర్వాత ఎందుకొన్నాం రా బాబు అనే రేంజిలో ఫీల్ అయ్యారు.ఎందుకంటే అందులో మ్యాటర్ లేదట సినిమా అంతా ఓ స్పూఫ్ లా ఉంది.పైగా చిత్రం బాగా బోరింగ్ గా సాగింది.ఈ చిత్రానికి ఇప్పటి వరకు దాదాపు 1,20,000 టికెట్స్ సేల్ అయ్యాయట.
ఈ చిత్రం పై ఆర్జీవి కనీసం పది లక్షలు కూడా ఖర్చు పెట్టలేదట.ఈ చిత్రం పై దాదాపు పది రెట్లు డబ్బులు వర్మ సంపాదించుకున్నాడు. తన ప్రయోగం సక్సెస్ అయ్యి బాగా డబ్బులు రావడంతో మరోసారి ఈ ప్రయోగానికి సిద్దమైపోయారు.ఈసారి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని టార్గెట్ చేసే స్క్రిప్ట్ ను రెడీ చేసుకుంటున్నారు. ఇది చూస్తున్న జనాలు,సినీ విశ్లేషకులు వర్మ ఏంటయ్యా మాకు ఈ కర్మ అని తలలు బాదుకుంటున్నారు.
End of Article