Ads
వివాదాలకు కేంద్రబిందువైన ఆర్జీవి తాజాగా పవర్ స్టార్ అనే చిత్రం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన 4 నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ యూట్యూబ్ లో లీక్ అయ్యింది.దానితో ఆర్జీవి అఫీషియల్ గా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశాడు.
Video Advertisement
ఆ ట్రైలర్ మొదట్లో ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అంకితం ఇస్తున్నట్లు మన ఆర్జీవి మెన్షన్ చేశారు.ఈ ట్రైలర్ లో పవన్ పేరును కొద్దిగా మార్చారు.అందులో పవన్ మూడవ భార్య అన్నా లెజ్నేవా, రేణు దేశాయ్ ఫోన్ చేసినందుకు పవన్ పై సీరియస్ అవ్వడం మెగాస్టార్ నువ్వు పవర్ స్టార్ అయ్యింది నా వల్లే అంటూ పవన్ ను నిలదీయడం వంటి ఫ్యామిలీ విషయాలు చంద్రబాబు నాయుడి పాత్రను పోలి ఉన్న వ్యక్తితో మిమ్మల్ని నమ్మవద్దని అందరూ చెప్తున్నా వినలేదు అందుకే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ ఫైర్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయి.
బండ్ల గణేష్ పాత్రను పోలిన పాత్ర ఒకటి ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది.అలాగే పవన్ కు రాజకీయ స్పీచ్ లు అందించిన ఒక ప్రముఖ దర్శకుడిని పవన్ కొట్టినట్టు ఓ సన్నివేశం ఉంది.మొత్తానికి రాజకీయాలలో పవన్ ఉండాలా లేదా అనే మీమాంసలో ఉన్నట్టు ట్రైలర్ లో ఆర్జీవి చూపించారు.
watch video:
End of Article