రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” టైటిల్ లో “MS, NB, TS” అంటే వాళ్లేనా..?

రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్” టైటిల్ లో “MS, NB, TS” అంటే వాళ్లేనా..?

by Megha Varna

Ads

భారతీయ దర్శకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . శివ సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచంలో ఉన్న అన్ని జోనర్ల సినిమాలు తీసాడు వర్మ .కాగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఎప్పుడు వార్తలో నిలుస్తాడు రామ్ గోపాల్ వర్మ ..కాగా చాలా మంది కొత్త దర్శకులని ,సాంకేతిక నిపుణుల్ని ఇండస్ట్రీ కి పరిచయం చేసారు వర్మ .. అకస్మాత్తుగా కొత్తవారికి అవకాశం ఇస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ .తాజాగా రామ్‌గోపాల్‌ వర్మ మరో సంచలన బయోపిక్‌ కోసం సన్నాహాలు చేస్తున్నారు.

Video Advertisement

పవన్‌ కల్యాణ్‌పై సినిమా చేయనున్నట్లు సోసల్ మీడియా ద్వారా ప్రకటించాడు దర్శకుడు వర్మ.ట్విటర్‌ వేదికగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నా కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ అని పేరు పెట్టాం. పీకే, ఎమ్‌ఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు,మరియు ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పవన్ కల్యాణ్ పాత్రను చేసింది ఇతడే అంటూ ఒక వీడియో విడుదల చేశాడు వర్మ.

 

అతడు మా ఆఫీస్‌ వద్దకు వచ్చినపుడు ఈ వీడియోను చిత్రీకరించాం అని , ఏ వ్యక్తినైనా పోలిన వ్యక్తులు ఉండటం యాధృచ్చికం కాని యాధృచ్చికం  అంటూ తన దైన శైలిలో ట్విట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ .అయితే వర్మ చేసిన ట్వీట్ పై పవన్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఇది ఇలా ఉండగా…పీకే, ఎమ్‌ఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు,మరియు ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం అని రామ్ గోపాల్ వర్మ చెప్పిన దానికి…ఎమ్‌ఎస్‌, ఎన్‌బీ, టీఎస్ ఎవరు అనేది చర్చనీయాంశం అయ్యింది…దీనిపై కత్తి మహేష్ ట్వీట్ చేసారు…”ఈ వర్మ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కన్నా ఎక్కువ నేను వెయిట్ చేస్తున్నా…PK = పవన్ కళ్యాణ్, MS = మెగా స్టార్, NB= నాగబాబు, TS = త్రివిక్రమ శ్రీనివాస్….రష్యన్ లేడీ ఒకే. నలుగురు పిల్లలు సరే. ఎనిమిది గేదెలు…ఒక వర్మ…హమ్మో హమ్మో…వర్మ ఎదో చేస్తున్నాడు.” అని ఆయన పోస్ట్ చేసారు.


End of Article

You may also like