Home Filmy Adda RGV VYOOHAM release date: ఎట్టకేలకు వర్మ సినిమాకి మోక్షం… త్వరలో విడుదల…!

RGV VYOOHAM release date: ఎట్టకేలకు వర్మ సినిమాకి మోక్షం… త్వరలో విడుదల…!

by Sainath Gopi

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా వివాదం సృష్టించేల రూపొందింస్తున్న చిత్రం వ్యూహం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రతిబింబించేలా తర్కెక్కించాడు. రాంగోపాల్ వర్మ వైసిపి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడుని, లోకేష్ ని, జనసేన అధినేతని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వ్యూహం సినిమాని తీశారు.

అయితే ఈ సినిమాని ముందుగా నవంబర్ నెలలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.అయితే ఇది నిజ జీవిత వ్యక్తులను టార్గెట్ చేసే విధంగా ఉంది అంటూ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసేందుకు నిరాకరించింది. అయితే ఇప్పుడు ఆ సమస్యలన్నీ తొలగిపోయి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందంటూ వర్మ ప్రకటించారు. ఈ సినిమాని రెండు పార్ట్ లుగా రూపొందించారు. మొదటి పార్ట్ వ్యూహం డిసెంబర్ 29 విడుదల కానుండగా రెండవ పార్ట్ శపధం జనవరి 25న విడుదల కానుంది.

ఈ సినిమాలో వైయస్ జగన్ పాత్రలో అజ్మల్, వైయస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించారు. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు. బ్యాడ్ పీపుల్ కి బ్యాడ్ న్యూస్ అంటూ వర్మ ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను చూపిస్తూ పోస్ట్ పెట్టారు.

You may also like