Ads
సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు రోజుకొక సరికొత్త మలుపు తిరుగుతుంది.ఈ కేసు ఇప్పటికే బీహార్ పోలీసులు వెర్సెస్ ముంబై పోలీసులు అనే కోణంలోకి మారుతుంది. ముంబై పోలీసులు ఈ కేసును క్లోజ్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని దేశంలోని సుశాంత్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Video Advertisement
అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఓ సూపర్ హిట్ కోసం నానా కష్టాలు పడుతున్న రియా చక్రవర్తి ప్రస్తుతం దేశమంతటా హాట్ టాపిక్ గా మారిపోయింది. బాలీవుడ్ లోని చాలామంది ప్రముఖులు ఈమె సుశాంత్ ని టార్చర్ చేసేదని అతని డబ్బు అంతా జల్సాలు కోసం వాడేదని ఆరోపిస్తున్నారు.
ఇక తాజాగా సుశాంత్ సూసైడ్ కేసు కేంద్రం సీబీఐకి అప్పగించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ లో కేసు నమోదు చేశారు.అందుకోసం హీరోయిన్ రియాను విచారణకు హాజరవ్వాలని కోరారు.
ఇది ఇలా ఉండగా…రియా చక్రవర్తి సుశాంత్ తో జరిపిన వాట్సాప్ చాట్ యొక్క స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ వాట్సాప్ సందేశాలలో, పార్టీలో రియా చక్రవర్తిపై దాడి చేసినందుకు సుశాంత్ తన సోదరి ప్రియాంకపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ చాట్ మీరే చూడండి.
రియా ఫ్యామిలిని ,తన జీవితంలో వాళ్లందరిని కలిగి ఉన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సుశాంత్ రియాతో చాట్ మొదలు పెట్టాడు. తన సోదరి ప్రియాంక గురించి చెప్తూ బాధపడ్డాడు సుశాంత్. pure evil .she is manipulating sidh bhai అంటూ మెసేజ్ చేసాడు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండు అలా ఉంటే బాగుంటావ్.. నేను ప్రశాంతంగా నిద్రపోతాను అంటూ తర్వాత మెసేజ్ సందేశం. సిద్ భాయ్ అంటే సుశాంత్ స్నేహితుడు సిద్దార్ద్ పితాని అనుకుంట. అసలు ప్రియాంకకి సుశాంత్ కి మధ్య ఏం జరిగింది??సిద్ కి ప్రియాంకకి ఉన్న సంబందం ఏంటి అనే అనుమానాలు కొత్తగా తెరమీదకి వచ్చాయి.
End of Article