“ఇవి 4 డ్రాప్స్ టీ లో కలుపు…30 నిమిషాల తర్వాత” డ్రగ్ డీలర్ తో రియా వాట్సాప్ చాట్..!

“ఇవి 4 డ్రాప్స్ టీ లో కలుపు…30 నిమిషాల తర్వాత” డ్రగ్ డీలర్ తో రియా వాట్సాప్ చాట్..!

by Mohana Priya

Ads

ఎన్నో రోజుల చర్చ తర్వాత ఎట్టకేలకు సుప్రీంకోర్టు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు సిబిఐకి అప్పగించింది. సిబిఐ దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి రాని ఎన్నో విషయాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. రియా చక్రవర్తి మీద ముందునుండి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు రియా చక్రవర్తి ఒక డ్రగ్ డీలర్ తో చేసిన వాట్సాప్ చాట్ బయటికి వచ్చింది.

Video Advertisement

రియా చక్రవర్తి గౌరవ్ ఆర్య అనే ఒక డ్రగ్ డీలర్ తో మిథైలిన్ డైఆక్సీ మెథం ఫెటమిన్ (MDMA) అనే డ్రగ్ గురించి అడిగారు. ఈ డ్రగ్ చాలా ప్రమాదకరమైనదట. ఇదంతా ఈడి అధికారుల దృష్టికి వచ్చింది. “పవర్ ఎక్కువగా ఉన్న డ్రగ్స్ గురించి మాట్లాడాలి (హార్డ్ డ్రగ్స్). ఇప్పటివరకు నేను ఎక్కువగా వాడలేదు” అని అర్థం వచ్చేలా ఆ సంభాషణ ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చాటింగ్ మార్చి 2017 లో జరిగింది.

సుశాంత్ హోమ్ స్టాఫ్ శామ్యూల్ మిరాండా తో కూడా రియా చక్రవర్తి మాట్లాడారు. శామ్యూల్ రియా తో ” హాయ్ రియా స్టఫ్ దాదాపు అయిపోయింది” అని అనగా అందుకు రియా చక్రవర్తి “షోవిక్ (రియా చక్రవర్తి సోదరుడు) స్నేహితుడి దగ్గర నుండి తీసుకోవాలా? కానీ అతని దగ్గర హాష్ ఇంకా బడ్ (ఒక రకమైన డ్రగ్స్) మాత్రమే ఉన్నాయి” అని జవాబిచ్చారు. ప్రస్తుతం సిబిఐ దర్యాప్తులో భాగంగా సుశాంత్ సన్నిహితులందరినీ ప్రశ్నిస్తున్నారు.

అలాగే టాలెంట్ మేనేజర్ జయ సాహా రియా చక్రవర్తి తో మాట్లాడిన వాట్సాప్ చాట్ కూడా బయటకు వచ్చింది. జయ సాహా రియా చక్రవర్తి కి పంపిన మెసేజ్ లో “4 చుక్కలు టీ లో కానీ కాఫీ లో కానీ కలిపి, అది అతనిని తాగనివ్వు. తాగిన 30 నుండి 40 నిమిషాల మధ్యలో దీని ప్రభావం మొదలవుతుంది” అని అర్థం వచ్చేలా ఉంది.

 


End of Article

You may also like