Ads
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసు లో మూడు రోజుల ఎంక్వయిరీ తర్వాత రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వీడియో కాల్ ద్వారా రియా చక్రవర్తిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ ని కొట్టివేశారు. రియా చక్రవర్తి ని 14 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం రియా చక్రవర్తిని జైలుకి తరలించారు.
Video Advertisement
ఇండియా టుడే కథనం ప్రకారం డ్రగ్స్ సరఫరా చేయడం, డ్రగ్స్ అరేంజ్ చేయడం, వినియోగించడం వంటి పలు అంశాలు ఈ కేసులో ఉన్న కారణంగా రియా చక్రవర్తి పై ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్) యాక్ట్ 1985 ప్రకారం, సెక్షన్ 22, 20, 27, 29 కింద కేసు నమోదు చేశారు.
ఫిల్మీ బీట్ కథనం ప్రకారం ముందు పంపించిన బెయిల్ పిటిషన్ కొట్టి వేయడంతో, రియా చక్రవర్తి కుటుంబ సభ్యులు మళ్లీ బెయిల్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ లో రియా చక్రవర్తి ఎటువంటి నేరాన్ని అంగీకరించలేదు అని, ఎన్సీబీ అధికారులు బలవంతంగా రియా చేత ఆ నేరాన్ని ఒప్పించారని, సాధారణంగా సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం స్త్రీలని ప్రశ్నించేటప్పుడు మహిళా అధికారులు, ఇంకా పోలీస్ కానిస్టేబుల్స్ ఉండాలని,
కానీ ఎన్సీబీ ఈ నియమం పాటించలేదు అని , రియా చక్రవర్తి ని ప్రశ్నించేటప్పుడు అసలు ఒక మహిళా అధికారి కూడా లేరు అని రియా చక్రవర్తి తరపు న్యాయవాది సతీష్ మాన్‌షిండే, రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ లో మెన్షన్ చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై సెప్టెంబర్ 10 వ తేదీన ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. దాంతో ఇప్పుడు రియా చక్రవర్తికి బెయిల్ లభిస్తుందా? లేదా? అనే విషయం పై అనుమానాలు నెలకొన్నాయి.
End of Article