Ads
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసు లో మూడు రోజుల ఎంక్వయిరీ తర్వాత రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రియా చక్రవర్తి ని 14 రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం రియా చక్రవర్తిని జైలుకి తరలించారు.
Video Advertisement
ఇండియా టుడే కథనం ప్రకారం డ్రగ్స్ సరఫరా చేయడం, డ్రగ్స్ అరేంజ్ చేయడం, వినియోగించడం వంటి పలు అంశాలు ఈ కేసులో ఉన్న కారణంగా రియా చక్రవర్తి పై ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్) యాక్ట్ 1985 ప్రకారం, సెక్షన్ 22, 20, 27, 29 కింద కేసు నమోదు చేశారు.
న్యాయవాది సతీష్ మాన్‌షిండే రియా చక్రవర్తి కేస్ హ్యాండిల్ చేస్తున్నారు. సతీష్ అంతకు ముందు ఎంతో మంది ప్రముఖులు తరఫున వాదించారట. 2002లో హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ తరపున వాదించారు సతీష్.
అలాగే 1993లో ముంబై బాంబ్ బ్లాస్ట్, ఇంకా ఇల్లీగల్ వెపన్స్ కేసులో సంజయ్ దత్ తరపున వాదించారు. బాలీవుడ్ లైఫ్ కథనం ప్రకారం ఒకరోజు రిప్రజెంట్ చేయడానికి సతీష్ 10 లక్షలు తీసుకుంటారట. అంతేకాకుండా పాల్ఘర్ లించింగ్ కేసులో సతీష్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా అపాయింట్ అయ్యారట.
డ్రగ్స్ విషయంలో కొంతమంది సెలబ్రిటీల పేర్లు రియా చక్రవర్తి కి తెలుసు అని చెప్పడంతో, ప్రస్తుతం సుశాంత్ రాజ్ పుత్ మరణం కేసు డ్రగ్స్ కేస్ గా మారింది. దాంతో డ్రగ్స్ తీసుకునే సెలబ్రిటీల జాబితాలో ఎవరెవరు ఉన్నారు అని వైపు దృష్టి పెడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఎంత మంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఎన్సీబీ మాత్రం ఏ ఒక్కరి పేరు కూడా అధికారికంగా ప్రకటించలేదు.
End of Article