Ads
బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ లు అందుకుంటున్న సుశాంత్ సింగ్ సడన్ గా ఆత్మహత్య చేసుకోవడం దేశం మొత్తాన్ని విస్తుపోయేలా చేసింది.సుశాంత్ సింగ్ మరణానికి కారణమంటూ ప్రచారంలో నిలిచిన సెలబ్రెటీలను,ఆయన సన్నిహితులను ఇప్పటికే పోలీసులు విచారించారు.సుశాంత్ సింగ్ ఆత్మహత్య పై సిబిఐ ను వేయాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు.
Video Advertisement
తాజగా ఆ లిస్టులోకి ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా చేరారు.దీని పై ఆమె స్వయంగా ట్విట్టర్ లో ఇలా స్పందించారు.అదేంటో ఇప్పుడు చూద్దాం.నేను సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని తన హఠాత్ మరణం జరిగి ఇప్పటికీ నెల అవుతుంది.నాకు ప్రభుత్వం పై పూర్తి నమ్మకం ఉంది. నేను చేతులు కట్టుకుని మరీ మిమ్మల్ని కోరుతున్నాను దయచేసి ఈ కేసును సిబిఐ కు అప్పజెప్పండి అని హోం మంత్రి అమిత్ షాను కోరింది.
ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య పై బోలెడు మంది కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ దర్యాప్తుకు అప్పజెప్పాలని కోరుతున్నారు.మరి దీని పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
End of Article