Ads
గత కొద్దికాలంగా సినీ ఇండస్ట్రీలో నెపోటిజం,కాస్టింగ్ కౌచ్ పై చర్చ జరుగుతుంది.తాజాగా ఈ చర్చ సుశాంత్ సింగ్ మరణానంతరం పతాక స్థాయికి చేరింది.దీని పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.ఈ జాబితాలోకి తాజాగా సుశాంత్ సింగ్ స్నేహితురాలు రిచా చద్దా కూడా చేరారు.ఈమె సోషల్ మీడియాలో బాలీవుడ్ లో ఉన్న చీకటి కోణాల పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Video Advertisement
అవేంటో ఇప్పుడు చూద్దాం.ఇండస్ట్రీ రెండూ వర్గాలుగా విడిపోయింది…ఇందులో ఒక వర్గం జాలి ఉన్నవాళ్లు.. రెండవ వర్గం జాలి లేని వాళ్లు.. స్టార్ కిడ్స్ లో కూడా మంచివాళ్ళు ఉన్నారు.వారు అందరితో చాలా మంచిగా ఉంటారు. కానీ కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో పాతుకుపోయిన జాలిలేని వర్గం మాత్రం హీరోయిన్లను చాలా చులకనగా చూస్తారని ఆ వర్గంలో కొందరూ నీచులు సుశాంత్ మరణించిన తర్వాత సంతాపం వ్యక్తం చేశారని రిచా చద్దా చెప్పుకొచ్చారు.
ఆ దర్శకులు ముందుగా హీరోయిన్లుకు అవకాశాలు ఇచ్చి ఆ తర్వాత తమ గదికి రావాలని డిమాండ్ చేస్తారు.దానికి హీరోయిన్లు ఒప్పుకోకపోతే వారిపై తప్పుడు ప్రచారం చేసి.. తమ సినిమాల నుంచి తీసేస్తారు. ఇలాంటి సందర్భాలు బాలీవుడ్ లో చాలా జరిగాయని ఆమె వెల్లడించారు.ఇక సుశాంత్ తో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సుశాంత్ నన్ను బైక్ మీద థియేటర్ గ్రూప్ వర్క్ షాపుకు తీసుకెళ్లేవాడని రిచా చద్దా అన్నారు.
End of Article