Home Filmy Adda కాంతారా హీరో చేసిన పని తెలిస్తే అభినందించకుండా ఉండరు…!

కాంతారా హీరో చేసిన పని తెలిస్తే అభినందించకుండా ఉండరు…!

by Sainath Gopi

కాంతారా సినిమా అంటే ఎవరు ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.కాంతారా సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టి రేంజ్ మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఏ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కాంతారా సినిమా దేశ వ్యాప్తంగా ఏకంగా రూ.400 లకు పైగా కోట్లు కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది.rishab shetty remunaration for kanthaara movie..??

ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతారా-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.ఇటీవల విడుదలైన పోస్ట్ లుక్ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా రిషబ్ శెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని తన స్వగ్రామమైన కెరడిలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు.

తన రిషబ్ శెట్టి ఫౌండేషన్ ద్వారా ఆ స్కూలుకు సాయం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆ హీరోను ఆకాశానికెత్తుతున్నారు. ఇది కదా హీరోలు చేయాల్సిన పని అంటూ అభినందిస్తున్నారు.రిషబ్ శెట్టి రీల్ హీరోనే కాదు…రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

You may also like