Ads
ప్రతి ఆదివారం ఈ టీవీలో మధ్యాహ్నం పూట ప్రసారమయ్యే ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మామూలుగా అయితే ఆదివారం పూట ఎక్కువగా సినిమాలు టెలికాస్ట్ చేస్తారు. కానీ ఈ టీవీ మాత్రం డిఫరెంట్ గా ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తుంది. అది కూడా మధ్యాహ్నం పూట ఈ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది.
Video Advertisement
ప్రతి వారం ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వివిధ రంగాలకి చెందిన ప్రముఖులను గెస్ట్ లుగా ఆహ్వానించి, జబర్దస్త్ లో కమెడియన్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
అయితే, వచ్చే వారం కూడా ఇదే విధంగా జబర్దస్త్ ప్రోగ్రాంకి చెందిన కొంత మంది కమెడియన్స్ ఈ ప్రోగ్రాంకి వస్తున్నారు. ఇందులో హైపర్ ఆది స్కిట్ లో తరచుగా కనిపించే రాజు కూడా ఉన్నారు. రాజు గత కొద్ది కాలంగా జబర్దస్త్ లో కనిపించడం లేదు. దాంతో “రాజు ప్రోగ్రాం నుండి వెళ్ళిపోయారు ఏమో?” అని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ విషయంపై రాజు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో మాట్లాడారు.
సత్యం రాజేష్ అడిగిన ప్రశ్నకి రాజు మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు . “కరోనా సెకండ్ వేవ్ సమయంలో మనవరాలు పుట్టింది. నేను బయటికి వెళ్లి వస్తూ ఉంటే ఆ అమ్మాయికి ఏమైనా అవుతుంది ఏమో అని భయపడ్డాను. “ఆది గారు నాకు భయంగా ఉంది” అంటే, “అయ్యో రాజు గారు మీరు రాకపోయినా పర్లేదు” అని చెప్పి మా ఇంటికి నెల నెలా పేమెంట్ పంపించారు. నేనేం చేయాలో అర్ధం కావట్లేదు. పాదాలకి నమస్కారం పెడదాం అంటే చిన్నవాడు” అని చెప్పి ఎమోషనల్ అయ్యారు రాజు.
watch video :
End of Article