మనిషి అన్న తర్వాత ఎప్పుడో ఒక రోజు మనల్ని విడిచి వెళ్లడం అనేది సహజం. కానీ అలాంటి పరిస్థితి వస్తే సన్నిహితులకి మాత్రం తట్టుకోవడం కష్టమే. ఇలాంటి పరిస్థితి ఇటీవల ఒక అమ్మాయికి ఎదురు అయ్యింది. కానీ అదే రోజు ఆమె మరొక పని కూడా చేయాల్సి ఉంది.

Video Advertisement

వివరాల్లోకి వెళ్తే, మధ్య ప్రదేశ్ లోని జబేర ప్రాంతంలో బన్వర్ గ్రామానికి చెందిన రియా అనే ఒక అమ్మాయి 12వ తరగతి చదువుతోంది. రియా ప్రస్తుతం పరీక్షలు రాస్తోంది. ఉదయం 9 గంటలకి కెమిస్ట్రీ పేపర్ ఉంది. కానీ అదే రోజు 6 గంటల సమయంలో తండ్రి వాల్మీకి మరణించారు. గుండెపోటు వచ్చింది అని ఆసుపత్రికి తీసుకెళుతూ ఉంటే దారిలోనే వాల్మీకి చనిపోయారు.

riya story madhya pradesh

ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ బాధలో ఉన్నప్పుడు పరీక్ష ఉంది అనే విషయం గుర్తుకు వచ్చి రియాని పంపించారు. తన తండ్రి లేరు అన్న బాధను దిగమింగుకొని రియా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. ఎగ్జామ్ అవ్వగానే పరీక్ష సెంటర్ కి రియా తమ్ముడు వచ్చాడు. వారిద్దరూ కలిసి తన తండ్రిని చూడడానికి వెళ్లారు. ఇప్పటి వరకు అన్ని ఎగ్జామ్స్ బాగా రాసాను అని, ఈ పరీక్ష కూడా బాగానే రాశాను అని, కానీ అది తెలుసుకోవడానికి తన తండ్రి లేరు అని చెప్పే రియా బాధపడింది.