Home Bigg Boss 5 telugu RJ Kajal : కాజల్‌పై ఫైర్ అయిన బిగ్‌బాస్ యాజమాన్యం..? కారణం అదేనా..?

RJ Kajal : కాజల్‌పై ఫైర్ అయిన బిగ్‌బాస్ యాజమాన్యం..? కారణం అదేనా..?

by Mohana Priya

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చివరి వారంలోకి ఎంటర్ అయింది. గత వారం జరిగిన ఎలిమినేషన్‌లో కాజల్ ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. ఫైనలిస్ట్ లుగా సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ నిలిచారు. వచ్చే వారం గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. ఈ చివరి ఎపిసోడ్‌కి అతిధులుగా ప్రముఖ సెలబ్రిటీలు వస్తారని సమాచారం. ఎపిసోడ్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసారట.

ఇదిలా ఉండగా, కాజల్ బిగ్ బాస్ కి సంబంధించి ఒక ముఖ్యమైన నిబంధన ఉల్లంఘించారని సమాచారం. సాధరణంగా మనకి టీవీలో చూపించే ఒక రోజు ముందే ఎపిసోడ్ షూట్ అవుతుంది. అంటే, ఆదివారం చూపించే ఎపిసోడ్ శనివారం రోజు షూట్ అవుతుంది.

rj kajal broke a rule of bigg boss telugu 5

ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఇంటి నుండి బయటకి వచ్చిన తర్వాత, బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్‌లో మాట్లాడిన తర్వాత, అప్పుడూ వేరే మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వాలి. సాక్షి కథనం ప్రకారం, కాజల్ ఇదే రూల్ బ్రేక్ చేసినట్టు సమాచారం. బిగ్ బాస్ బజ్ ప్రసారం అయ్యే ముందే కాజల్ ఒక యూట్యూబ్ ఛానెల్‌కి లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చారని, దాంతో బిగ్ బాస్ యాజమాన్యం కాజల్ ని, “బిగ్ బాస్ బజ్ ప్రసారం అవ్వకముందే వేరే ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు అనే రూల్ ఎలా మార్చిపోయారు?” అని అడిగారని సమాచారం.

You may also like