కరోనా నుండి కోలుకున్నాడు…వెంటనే పోలీసులు అరెస్ట్ చేసారు.! అతి చేస్తే ఇలాగే ఉంటది!

కరోనా నుండి కోలుకున్నాడు…వెంటనే పోలీసులు అరెస్ట్ చేసారు.! అతి చేస్తే ఇలాగే ఉంటది!

by Megha Varna

Ads

కరోనా భారిన పడిన సామాన్య ప్రజలు ఉన్నారు అలాగే సెలెబ్రెటీలు కూడా ఉన్నారు.ఎందుకంటే కరోనా వైరస్ కు ఎటువంటి తారతమ్యం లేదు అనే విషయం తెలిసిందే.బెంగళూర్ కార్పొరేటర్ కు ప్రమాదవశాత్తు కరోనా వైరస్ సోకింది.దీంతో అతనిని ఐసొలేషన్ వార్డ్ కు తరలించి చికిత్స అందించారు.అయితే ఆయన కరోనా భారీ నుండి బయట పడ్డారు దీంతో రోడ్ మీద తిరుగుతూ భారీ ర్యాలీ నిర్వహించాడు.కాగా ఇప్పుడు ఈ విషయం అంతటా చర్చనీయాంశం గా మారింది.వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

కరోనా భారిన పడగానే తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు బెంగళూర్ కార్పొరేటర్.కానీ చికిత్స అందుకునే సమయంలో మనో దైర్యం తో ఉంటూ మంచి ఆహారం తీసుకుని ఎట్టకేలకు కరోనా బారినుండీ బయటపడ్డారు.చికిత్స పూర్తి కాగానే వైద్యులు మళ్ళీ తిరిగి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ గా నిర్దారణ కావడంతో ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.ఆసుపత్రి నుండి బయటకు వస్తూనే ఒక వ్యాన్ లో ఎక్కి ఎక్కువ మంది జనంతో కలిసి కేకలు వేసుకుంటూ, గట్టిగా అరుస్తూ ,బాణాసంచా కాల్చుకుంటూ పెద్ద ఎత్తున్న నగర విధులలో ర్యాలీ చేసారు.

ఇది చుసిన ప్రజలు ఈయన ఏమి కార్పొరేటర్ రా బాబు సామాజిక దూరం పాటించమని ప్రభుత్వాలు ఇంతలా చెప్తున్నా ఈ సమయంలో కూడా బాధ్యత లేకుండా ర్యాలీ చేస్తున్నాడు అని మండిపడ్డారు .అయితే బాధ్యతారహితంగా ప్రవర్తించిన కార్పొరేటర్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


End of Article

You may also like